English   

ఇరువురి భామల నడుమ మహేష్ !

mahesh
2019-03-06 02:17:39

గత ఏడాది భరత్ అనే సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ఈ ఏడాది మహర్షి అనే సినిమాతో వచ్చేందుకు సిద్దమయ్యాడు. అది వచ్చే నెల చివరిలో రిలీజ్ అవనుంది. అయితే కొద్దిపాటి టాకీ పార్ట్ మినహా అంతా పూర్తావ్డంతో ఆయన తర్వాతి సినిమా కూడా లైన్ లో పెట్టేశాడు, ముందు నుండీ అనుకుంటున్నట్టు సుకుమార్ తో సినిమా లేదని ఆయనకు నాకు క్రియేటివ్ మనస్పర్ధలు వచ్చిన కారణంగా ఆ సినిమా చేయట్లేదని మహేష్ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన తర్వాతి సినిమా అనిల్ రావిపూడితో ఉంటుందనేది ఫిక్స్ అయినట్టే. అందుతున్న సమాచారం ప్రకారం మ‌హేష్ బాబు  అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప‌నులు వేగంగా సాగుతున్నాయట. ఎట్టి ప‌రిస్థితుల్లో అయినా ఇంకొద్ది రోజుల్లో స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి మేలో ఈ సినిమా ప‌ట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ ని రిక్రూట్ చేసుకునే పనిలో ఉందట డైరెక్షన్ టీం. అయితే విశ్వసనీయ వర్హ్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు ఛాన్స్ ఉందట వారిలో సాయి ప‌ల్ల‌వి, ర‌ష్మిక మంద‌న్నా పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. మ‌హేష్ తో ఇప్ప‌టి వ‌ర‌కూ న‌టించ‌లేదు, అదీ కాక ప్రస్తుతం వీళ్ళకి యూత్ లో క్రేజ్ కూడా ఉంది, కాబాట్టి వీళ్లను తీసుకుంటే ఏదైనా మ్యాజిక్ క్రియేట్ అవ్వచ్చని అనిల్ భావిస్తున్నాడట. అన్నీ కుదిరితే మహేష్ సరసన వీళ్ళిద్దరూ హీరోయిన్స్ గా మెరవడం ఖాయం.

More Related Stories