English   

తమిళ సినిమాలో నటించబోతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..

Suriya-Mohan-Babu
2019-03-06 03:26:47

దాదాపు 530 సినిమాల్లో నటించి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు చేశాడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ మధ్య కాలంలో ఈయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు.. రాజకీయ వేడి ఇవన్నీ చూస్తూ కాలం గడిపేస్తున్నాడు మోహన్ బాబు. ఇలాంటి సమయంలో మనకు ఒక అద్భుతమైన పాత్ర వచ్చింది. అది కూడా తెలుగులో కాదు తమిళ ఇండస్ట్రీలో. రెండేళ్ల కింద వెంకటేష్ హీరోగా వచ్చిన గురు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్ర దర్శకురాలు సుధా కొంగర ప్రస్తుతం సూర్య హీరోగా ఒక సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. ఇందులో ఒక కీలకమైన పాత్ర కోసం మోహన్ బాబు అయితే బాగుంటారని ఆమె భావిస్తుంది. కథ విన్న తర్వాత సూర్య కూడా ఈ పాత్ర కేవలం కలెక్షన్ కింగ్ మాత్రమే చేయగలడు అంటూ ఆయన ప్రత్యేకంగా వచ్చి మోహన్ బాబును ఈ పాత్రకోసం అడిగాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో కలెక్షన్ కింగ్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కెరీర్ కొత్తలో దాదాపు 40 ఏళ్ల కింద గురు అనే తమిళ సినిమాలో నటించాడు. మోహన్ బాబు ఆ తర్వాత మళ్లీ ఆయన తమిళ ఇండస్ట్రీ కి వెళ్ళింది లేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత సూర్య సినిమా కోసం నేలపై అడుగుపెడుతున్నాడు కలెక్షన్ కింగ్. మరి ఇప్పుడు ఆ పాత్ర మోహన్ బాబు ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. ఈ చిత్రం షూటింగ్ మొదలు కావడానికి ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే సూర్య ప్రస్తుతం కె.వి.ఆనంద్ ఈ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాతో పాటు ఎన్జికే సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత సూర్య కాస్త ఫ్రీ అవుతాడు. అది అయిపోయిన తర్వాత సుధా సినిమా సెట్స్ పైకి రానుంది.

More Related Stories