English   

మా ఎన్నికల్లో చివరికి చిరంజీవి ఇరుక్కోడు కదా..

Chiranjeevi
2019-03-06 05:39:44

ఏమో ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు.. ఉన్న వాతావరణం బట్టి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే అటు శివాజీరాజా వర్గం.. ఇటు రాజశేఖర్, సీనియర్ నరేష్ వర్గం ఇద్దరు వచ్చి చిరంజీవి సపోర్ట్ కోరుతున్నారు. ఆయన కూడా ఇద్దరితో సన్నిహితంగా ఉన్నాడు. వాళ్ళు సన్మానిస్తూ ఓకే అన్నాడు.. వీళ్లు శాలువా పరిచి దండం పెడితే తిరిగి దండం పెట్టాడు. శివాజీ రాజా, శ్రీకాంత్ వీళ్లంతా చిరంజీవికి ఎప్పటి నుంచో తెలుసు. అలాగే నరేష్, రాజశేఖర్, జీవితాలతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి మెగాస్టార్ చిరంజీవికి. ఇలాంటి సమయంలో ఎవరికి మెగాస్టార్ సపోర్ట్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు మా ఎన్నికలు కచ్చితంగా చిరంజీవి ఎవరికి సపోర్ట్ చేస్తే గెలిచే పరిస్థితుల్లో ఉందనేది ఒప్పుకోవాల్సిన సత్యం. గత ఎన్నికల్లో చిరంజీవి వీటికి దూరంగా ఉన్నాడు. ఈ సారి మాత్రం కచ్చితంగా మా ఎలక్షన్స్ లో చిరంజీవి కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే అది అర్థం చేసుకొని ముందుగానే అటు శివాజీ.. రాజా ఇటు నరేష్ ఇద్దరు చిరంజీవి దగ్గరికి వెళ్లి తమ వర్గానికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరారు. మెగాస్టార్ కూడా ఇద్దరికీ చిరునవ్వుతో సమాధానం చెప్పి పంపించారు. అయితే చివరికి ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారిందిప్పుడు. రెండు వర్గాల్లో ఏ ఒక్కరికి సపోర్ట్ చేసినా కచ్చితంగా రెండో వర్గంతో చిరంజీవికి తలనొప్పులు తప్పవు. ఈ విషయంలో మహేష్ బాబును కూడా మధ్యలో చూశాడు నరేష్. కానీ ఆయన మాత్రం మొహమాటం లేకుండా ఎలక్షన్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి పెద్దరికంతో ఇప్పుడు ఎవరో ఒకరిని సముదాయించి.. మరొకరికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ ఒక్కరు ఎవరు.. వదిలేసేది ఎవరనేది మార్చి 10న తేలనుంది.
 

More Related Stories