English   

మంచు విష్ణు రాజకీయాల్లోకి వస్తున్నాడు తెలుసా..

Manchu-Vishnu
2019-03-06 15:22:27

అదేంటి సినిమా రంగంలో విజయాలు రావడం లేదని ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడా అనుకుంటున్నారా.. అలాంటిదేమీ లేదు. మంచు విష్ణు రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది నిజం.. కానీ అక్కడే ఒక చిన్న అబద్ధం కూడా ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నది నిజంగా కాదు.. సినిమాల్లో. ఈ మధ్య కాలంలో మన హీరోలు ఎక్కువగా పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తున్నారు. మహేష్ బాబు భరత్ అనే నేను, విజయ్ దేవరకొండ నోటా ఇలాంటి సినిమాలే. ఇప్పుడు మంచు విష్ణు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈయన కూడా ఒక రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు జి.ఎస్.కార్తీక్ తెరకెక్కించిన ఓటర్ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుంది. నిజానికి ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని కూడా ఏడాదికి పైగానే అవుతుంది. ఆచారి అమెరికా యాత్ర సినిమా కంటే ముందే ఓటర్ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. విష్ణు కూడా ఓటర్ సినిమా గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ రాజకీయాలను మలుపు తిప్పిన కీలక నేతల ఫోటోలను అన్ని కలిపి విష్ణు మొహం వచ్చేలా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇన్నాళ్ళకు ఈ సినిమాకు పట్టిన బూజును మళ్ళీ దులిపేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఏప్రిల్లో ఓటర్ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పైగా అప్పుడు ఎన్నికల సమయం కూడా కావడంతో సినిమాకు ఇది కలిసొస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో ఓటుకు ఉన్న విలువ గురించి చెప్పబోతున్నారు. ఎలక్షన్ టైంలో ఇలాంటి సినిమా వస్తే ఖచ్చితంగా అది ప్రభావం చూపిస్తుందని మంచు విష్ణు కూడా నమ్ముతున్నాడు. మరి ఈయన ఓటర్ ఎలా ఉండబోతున్నాడో చూడాలి.

More Related Stories