English   

కొన్ని సార్లు రావడం లేట్ అవుద్ది కానీ...ఫ్యాన్స్ కి నితిన్ ట్వీట్ !

Nithiin
2019-03-06 09:40:00

యంగ్ హీరో నితిన్ న‌టించిన గత చిత్రాలు వరుసగా ఫ్లాప్ లనే మిగాల్చడంతో ఆయన ఒక హిట్ కోసం ఎదుటు చూస్తున్నాడు. ఛలో డైరెక్టర్  వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమాలో ఆయన నటించాల్సి ఉంది. అయితే ఆయన చేస్తున్న లేదా చేయాల్సిన ప్రాజెక్టుల‌కి సంబంధించి పూర్తి క్లారిటీ లేక‌పోవ‌డంతో ఆయన ఏమి చేస్తున్నాడో తెలీక కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆయన అభిమానులు. దీంతో ఆయన ఈ నెలాఖ‌రుకి త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన అప్‌డేట్ త‌ప్ప‌క ఇస్తానని ట్వీట్ చేశారు. ‘ఈ నెలాఖరులో చెప్పేస్తా.. పక్కా ప్రామిస్’ అలాగే షూటింగ్ కూడా త్వరలోనే ఉంటుంది. అన్నీ స్క్రిప్టింగ్ దశలోనే ఉన్నాయి ఈ ఏడాది రెండు సినిమాలు విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాను. మీరు ఇన్నాళ్ళు ఇంత ఓపిక‌గా ఉన్నందుకు ధ‌న్య‌వాదాలు  లవ్యూ ఆల్‌ అని నితిన్ త‌న ట్వీట్‌లో తెలిపారు. దీంతో కొన్ని సార్లు రావడం లేట్ అవొచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా అని నితిన్ అభిమానులు. నితిన్ గతంలో న‌టించిన ‘లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం’ సినిమాలు భారీ పరాజయాన్ని మిగల్చ‌డంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు నితిన్‌. ఈ సారి అయినా హిట్ కొడతారు ఏమో చూడాలి మరి.

More Related Stories