English   

మళ్ళీ వెనక్కెళ్ళిన మహర్షి సెంటిమెంటా ? భయమా ?

Mahesh-Babu
2019-03-06 16:58:14

మహర్షి సినిమాకి మారుతూ మారుతూ వచ్చిన రిలీజ్ డేట్ మళ్ళీ మారింది. షూటింగ్ పూర్తి కావొస్తున్న మహర్షి మే 9న వస్తున్నాడని నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి  మరీ ప్రకటించారు. ఈ సినిమా టాకీ మార్చి 17కి పూర్తవుతుందని రెండు పాటలు, కొంత మాంటేజ్ వర్క్ ఉంటుందని యా వర్క్ అబుదాబిలో జరుగుతుందని, సాంగ్స్ ఇక్కడే హైదరాబాద్ లో షూట్ చేస్తామని, అవి సెట్ సాంగ్స్ అని అన్నారు. అలాగే ఈ సినిమా మొదలు పెట్టినపుదు ఉగాది కానుకగా రిలీజ్ చేద్దామని అనుకున్నామని అమెరికా వీసాలు దొరక్క ఒక నెల షెడ్యూల్ ఆలస్యం కావడం వలన ఆ ఎఫెక్ట్ రిలీజ్ డేట్ మీద పడిందని ఆయన అన్నారు. ఏప్రిల్ 25న చేద్దామనుకున్నా మని కానీ ఈ సినిమా వంశీ పైడిపల్లి కెరీర్ లోనే అద్భుతమైన స్క్రిప్ట్ అని, సినిమా కూడా అంతే అద్భుతంగానే ఉందని భావిస్తున్నామని అన్నారు. అయితే ఇంత కష్టపడిన సినిమాని ఏదో హరి హరి అంటూ పోస్ట్ ప్రొడక్షన్ చేయలేమని అందుకే వంశీ, మహేష్ టీం అంతా కూర్చుని రిలీజ్ మే 9న చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 

మహర్షి చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని వంశీ పైడిపల్లి మా బ్యానర్ లో మూడు చిత్రాలు చేశాడు. ఆ చిత్రాలన్నింటికంటే మహర్షి కథ అద్భుతమైనది అని ఆయన పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ లో ఎలాగూ ఎన్నికల హడావిడి ఉంటుంది, ఆ తర్వాత పిల్లల పరీక్షలు ఉంటాయి, కాబట్టి ఆ హడావుడి అంతా ముగిసిన తర్వాత అందరూ ప్రశాంతంగా మహర్షి సినిమా చూడొచ్చని దిల్ రాజు అన్నారు. అలాగే ఇక మహర్షి చిత్రానికి సెంటిమెంట్ కూడా కలసి వస్తోందని దిల్ అశ్విని దత్ కు మే 9 బాగా కలసివచ్చింది. అప్పట్లో జగదేకవీరుడు అతిలోక సుందరి, గత ఏడాది వచ్చిన మహానటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇక నాకు కూడా మే నెల బాగా కలసివచ్చింది. భద్ర, పరుగు, ఆర్య లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఈ మే నెలలోనే విడుదలైనట్లు దిల్ రాజు తెలిపారు. అయితే ఈ నిర్ణయానికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు సినీ పండితులు అదేంటంటే పైగా ఏప్రిల్ లో సినిమాల తాకిడి ఎక్కువగా వుంది. ఏప్రియల్ 5న మజిలీ, 12 కాంచన, 19న జెర్సీ, ఉన్నాయి. ఎందుకొచ్చిన గొలలే అనే ఉద్దేశంతోనే ఇదివేనక్కు జరిపారని అంటున్నారు.

More Related Stories