English   

సెల్ఫీ వివాదం....షాక్ ఇచ్చిన కార్తీ !

Karthi
2019-03-06 10:06:43

వెటకారానికి, వ్యంగ్యంగా మాట్లాడడానికి ఒక సన్న గీత అడ్డంగా ఉంటుంది, నేటి సమాజంలో జనాలు ఆ గీతను పట్టించుకోకుండా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం అనుకుని వెటకారంగా మాట్లాడి ఎదుటి వారి మనసులు నొప్పించడమే కాదు వారి మనసులు గాయ పరుస్తున్నారు కూడా. తాజాగా అలాగే వెటకారం చేయలనుకొందో లేక వంగ్య కామెడీ పండించాలని అనుకుందో తెలీదు కానీ తమిళ సీనియర్ నటి కస్తూరి పలువురి ఆగ్రహానికి గురయ్యింది. అసలు విషయంలోకి వెళితే గత కొద్ది నెలల క్రితం హీరోలు సూర్య, కార్తీల నాన్న సీనియర్‌ నటుడు శివకుమార్‌ ఇటీవల ఓ అభిమాని తనతో సెల్ఫీ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ ఫోన్‌ లాక్కుని విసిరి కొట్టడం కొంచెం వివాదానికి కారణం అయ్యింది. ఇంటర్నెట్‌ లో ఆ వీడియో వైరల్‌ అయి శివకుమార్‌ కి ముక్కోపి గర్వం తలకెక్కినోడు అంటూ రకరకాలగా ట్రోల్ చేశారు. అయితే ఆ తర్వాత శివకుమార్‌ ఆ తర్వాత శివకుమార్‌ తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడిస్తూ సదరు యువకుడికి పబ్లిక్‌గా క్షమాపణలు కూడా చెప్పారనుకోండి అది వేరే విషయం. ఆ కుర్రాడికి కొత్త ఫోన్ కూడా కొనిచ్చారు. అయితే ఆ అంశాన్ని గుర్తు చేస్తూ జోక్‌ పేల్చాలని చూసింది నటి కస్తూరి. తాజాగా చెన్నైలో ‘జులై కాట్రిల్‌’ అనే సినిమా ఆడియో లాంచ్‌ వేడుక జరిగింది. ఈ వేడుకకు కస్తూరి వ్యాఖ్యాతగా వ్యవహరించగా హీరో కార్తి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ నేపథ్యంలో కస్తూరి కార్తిని సెల్ఫీ కావాలని అడుగుతూ పరోక్షంగా ఆయన తండ్రి శివకుమార్‌ను ఉద్దేశించి 'మీ నాన్నగారు ఇక్కడ లేరు కాబట్టి సెల్ఫీ దిగుదాం'మని అన్నది. ఆమె ఏమి ఉద్దేశించి మాట్లాడుతోందో అర్థమై సెల్ఫీకి కూడా నిరాకరించిన కార్తీ అనుమ‌తి లేకుండా ఎవ‌రిద‌గ్గ‌ర‌కైనా సెల్ఫీ కోసం ఎగ‌బ‌డితే ఎలా ఉంటుందో కొంత మందికి తెలియ‌దు. ఫోన్ నుంచి వ‌చ్చే ఫ్లాష్ లైట్ వ‌ల్ల మైగ్రేన్ స‌మ‌స్య ఉన్న‌వారికి చాలా స‌మ‌స్య‌లు వస్తాయ‌ని చెప్పి కార్తి అక్క‌ణ్నుంచి సెల్ఫీ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. 

More Related Stories