English   

మళ్ళీ తమిళ్ వైపు చూస్తున్న విజయ్ !

Vijay-Devarakonda
2019-03-06 17:22:48

అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ హోదా సంపాదించిన నటుడు విజయ్‌ దేవరకొండ. ‘గీత గోవిందం’, టాక్సీ వాలా సినిమాలతో ఆ స్థానాన్ని పదిలామ్ చేసుకున్నాడు. అయితే నోటా సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టినా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో పాటు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కూడా సింగరేణి నేపధ్యంలో ఓ సినిమా చేస్తున్నారు విజయ్‌. ఆ రెండు చిత్రాలు తెలుగు సినిమాలే. వీటి తర్వాత  మళ్లీ విజయ్‌ ఒక ద్విభాషా చిత్రం చేయనున్నారని అంటున్నారు. తమిళ దర్శకుడు శ్రీకార్తీక్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న ద్విభాషా సినిమాని విజయ్‌ ఒప్పుకున్నాడట. ఈ సినిమాలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. ఆ చిత్రం కోసమే విజయ్‌ బైక్‌ రేసింగ్‌కి సంబంధించిన మెలకువలు నేర్చుకుంటున్నట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. విజయ్‌ సరసన సీనియర్‌ కథా నాయిక నయనతార నటించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది.  అలాగే పెళ్లిచూపులు ఫేం ప్రియదర్శిని, రాహుల్‌ రామకృష్ణలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. ఇక విజయ్ డియర్ కామ్రేడ్ సినిమాని వేసవి కానుకగా అందించనున్నారని అంటున్నారు.

More Related Stories