English   

మాజీ ప్రియుడితో హన్సిక మూవీ !

Simbu
2019-03-06 17:50:04

దేశముదురుతో టాలీవుడ్‌కు పరిచయమైన హన్సిక మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించింది. అయితే ఆమె హీరోయిన్‌ గా తర్వాత ఎన్ని తెలుగు సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీలో కర్చీఫ్ వేసిన ఈ భామకి అక్కడ మాత్రం ఈజీగానే స్టార్ హీరోయిన్‌ అయిపొయింది. అయితే ఆమె తమిళ ప్లే బాయ్ శింభుతో ప్రేమాయణం నడుపుతోందని కొన్నాళ్ళ క్రితం వార్తలు వచ్చాయి. అయితే వీటిని వారు ఖండించకపోగా ఆ తర్వాత రోజుల్లో వారు విడిపోయారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విశాయం ఏంటంటే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయనున్నారు. అదే మహా, హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘మహా’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ వార్తల్లో నిలిచి పెద్ద వివాదం నడిచింది. అలాంటి సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు శింబుతో నటిస్తున్నట్టు ట్వీట్ చేసింది. మహా సినిమాలో శింబు అతిథి పాత్ర చేయనున్నారు. అనుకున్నదాని కంటే ముందే న్యూస్ లీకైంది. నేను, శింబు ‘మహా’లో మళ్లీ కలిసి నటిస్తున్నాం’ అంటూ హన్సిక ట్వీట్ చేశారు. ఇప్పటికే పోస్టర్ల వివాదంతో మంచి పబ్లిసిటీ సాధించిన ఈ సినిమా ఇప్పుడు శింబు, హన్సికల క్రేజీ కాంబినేషన్‌తో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. సోలో హీరోగా సక్సెస్ లేని శింబు ఈ మధ్య అతిథి పాత్రలు ఎక్కువగా చేస్తున్నారు. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘90ml’ చిత్రంలో అతిథి పాత్ర పోషించడంతో పాటు బిగ్ బాస్ బ్యూటీ ఓవియాకు ఘాటు లిప్‌లాక్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మళ్ళీ హన్షికతో కలిసి తెరపై కనివిందు చేయనున్నారు.

More Related Stories