English   

నమ్రతని మీట్ అయిన అరవింద్...అంత జరిగిందా ?

Allu-Aravind
2019-03-06 11:14:51

గత రెండ్రోజులుగా ఒకటే హాట్ టాపిక్ అదే, సుకుమార్ మహేష్ ల మధ్య వచ్చిన క్రియేటివ్ విభేదాలు, మహేష్ తోనే సినిమా చేస్తానన్న సుకుమార్ అల్లు అర్జున్‌ తో సినిమాను ప్రకటించడం, ఆ కొద్ది సేపటికే సుక్కుతో తన సినిమాని కొన్ని క్రియేటివ్ విభేదాల వలన రద్దుచేసుకున్నానని మహేష్‌బాబు స్పష్టం చేయడంతో బయటకు కనపడకపోయినా కాస్త పరిస్థిది కాస్త గుంభనంగానే మారింది. కొన్ని విభేదాల కారణంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని మహేష్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చినప్పటికీ లోపల ఏదో జరిగిందనే అనుమానం అటు టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది. ఈ అనుమానాలను మరింత పెంచేలా ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ప్రకటించడానికి ఒక్కరోజు ముందు అల్లు అరవింద్, మహేష్ డెట్లు సహా ఫైనాన్స్ వ్యవహరాలు అన్నీ చూసే ఆయన భార్య నమ్రతను కలిశారట. మహేష్‌ కు సుకుమార్ గతంలో చెప్పిన స్క్రిప్ట్ మీకు నచ్చలేదు కాబట్టి అది తన కొడుకు బన్నీతో మైత్రి వాళ్ళే ప్రొడ్యూసర్స్ గా సినిమా తీసుకుంటామని, దానికి బదులుగా కావాలంటే గీతా ఆర్ట్స్ లో మహేష్ తో ఒక సినిమా చేస్తామని చెప్పారట. అయితే నమ్రత కధ నచ్చక పోవడం ఏమీ లేదని తాము రెండు సినిమాలు(అనిల్, సుకుమార్) ఓకే సారి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారట. దాంతో అరవింద్ వెనక్కు వచ్చారట. ఏదైతే అది అయ్యింది లే అనే ధైర్యంతో వారు సినిమా ప్రకటించేయడం దానికి మహేష్ వెంటనే రెస్పాండ్ కావడం జరిగిపోయాయి. అక్కడ సుకుమార్ ని సుతిమెత్తగా ఎత్తి పొడిచాడు. వన్ సినిమా లాంటి కల్ట్ క్లాసిక్ ఇచ్చాడు అని చెప్పడం ద్వారా ఆయన అలాదెప్పి పొడిచినట్టు అయ్యింది. ఎందుకంటే గొప్ప సినిమా తీసిచ్చావ్ ఆ గాయం ఇంకా అలాగే వుంది అని ఇన్ డైరక్ట్ గా చెప్పినట్టే అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే సుకుమార్ అరవింద్ అండ చూసుకుని మహేష్ కి హ్యాండ్ ఇచ్చినట్టే అనిపిస్తోంది.

More Related Stories