English   

మా ఎన్నికలు జరగడానికి కారణం అదే అంటున్న నరేష్..

MAA-Association
2019-03-06 11:56:39

మా అసోసియేషన్ ఎన్నికలు జరగడానికి అసలు కారణం చెప్పాడు సీనియర్ నరేష్. నిజానికి ఇక్కడ ఎన్నికలతో పని లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. మూడేళ్ల కింద రాజేంద్ర ప్రసాద్, జయసుధ వర్గాల మధ్య యుద్ధాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఎలాంటి సమస్యలు లేకుండా అధ్యక్ష పదవి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో కూడా ఎలాంటి ఓటింగ్ లేకుండా శివాజీరాజాను ఏకగ్రీవంగా అధ్యక్ష పదవిపై కూర్చోబెట్టారు. అయితే ఈసారి మాత్రం ఎన్నికలు జరగడానికి అసలు కారణం బయట పెట్టాడు సీనియర్ నరేష్. వయసులో శివాజీరాజా కంటే తానే పెద్ద వాడినని.. అయితే తన మాట అర్థం చేసుకొని మా అసోసియేషన్ కోసం కొత్త కొత్త పద్ధతులు తీసుకురావాలని గత ఎన్నికల్లో శివాజీరాజాకు ఎలాంటి ఓటింగ్ లేకుండా నేరుగా అధ్యక్షుడిగా చేశామని చెప్పాడు నరేష్. కానీ గత ఏడాది తమ ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఈ సారి ఎన్నికలకు వెళ్తున్నాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు సీనియర్ నరేష్. విభేదాలు మాట పట్టింపులు వచ్చినప్పుడు కచ్చితంగా ఎన్నికలు ఏకగ్రీవంగా ఉండమని.. ఎవరికి ఎంత సపోర్ట్ ఉందో అసోసియేషన్ నిర్ణయిస్తారు అంటూ కామెంట్ చేశాడు. అందుకే ఈ సారి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి సపోర్టు కూడా ఒకే వర్గానికి ఉంటుంది అనడం కూడా అబద్ధమే అని.. ఆయన అందరివాడు అని ఎవరు గెలిచినా కూడా ఆనందిస్తాడు అంటున్నాడు నరేష్. అయితే ఏదో ఒక ప్యానల్ కు ఆయన సపోర్ట్ చేస్తాడు అనేది మాత్రం తప్పు అంటున్నాడు ఈయన. మొత్తానికి నరేష్ మాటలు చూస్తుంటే ఈ సారి మా ఎలక్షన్స్ వేడి ఎలా ఉండబోతుందో అర్థం అవుతుంది. మరోవైపు శివాజీరాజా వర్గం మాత్రం ఎలాంటి సందడీ లేకుండా తమ పని తాము చేసుకుంటున్నారు.

More Related Stories