English   

మే నెల దిల్ రాజుకి హిట్స్...మహేష్ కి ఫ్లాప్స్...భలే సెంటిమెంట్ !

maharshi-release
2019-03-07 08:52:29

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న మహర్షి సినిమా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా ఉగాదికి రావాల్సిన సినిమా ఏప్రిల్ 25కి వెళ్ళింది, ఆ తర్వాత  మేనెల 9వ తారీఖుకి వాయిదా వేశారు. సినిమా పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, మే 9వ తారీఖున విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నట్లు దిల్క్ రాజు ప్రకటించాడు. సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి కావడానికి ఈ నెల ఆఖరిదాకా పడుతుందని ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం పడుతుందని అంత చిన్న గ్యాప్ లో సినిమా విడుదల కష్టం అనే భావనతో పోస్టుపోన్డ్ చేసినట్లు ప్రకటించారు. అయితే మహేష్ బాబు కి మే నెల సెంటిమెంట్ గా మహేష్ కి అచ్చిరాదని అందరికి తెలుసు. ఎందుకంటే మహేష్ కెరీర్ కే ఒక మచ్చలా మిగిలిపోయిన సినిమా బ్రహ్మోత్సవం. ఈ చిత్రం రిలీజైంది మే నెలలో. ఈ దెబ్బతో మహేష్ మళ్లీ మే నెలలో సినిమా రిలీజ్ చేయడానికే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే మరి ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ఎలా ఒప్పుకున్నాడు అనేది ఆశ్చర్యంగా మారింది. ఆ ఒక్క సినిమానే కాక మే నెలలో రిలీజ్ అయిన మహేష్ సినిమాలు నిజం, నాని, కమర్షియల్ హిట్ కాలేదు. అందుకే ఆయన మేనెల కు దూరంగా ఉంటూ వచ్చాడు. గత ఏడాది కూడా భరత్ అనే నేను మే నెలలో రిలీజ్ అవ్వాల్సిన దాన్ని రేయింబవళ్ళూ కష్టపడి ఏప్రిల్ 20 డేట్ న రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా మే నెలలో రిలీజ్ కావడానికి దిల్ రాజు ఎలా ఒప్పించాడా అని ఆలోచిస్తే మరో సెంటిమెంట్ కనిపిస్తోంది. మే నెలలో దిల్ రాజు రిలీజ్ చేసిన ఆర్య, భద్ర, మున్నా, పరుగు, రామ రామ కృష్ణ కృష్ణ, సుప్రీం సినిమాలు గట్టిగా ఆడాయి, బహుశా మహేష్ కి ఆ సినిమాల లిస్ట్ చూపించి కన్విన్స్ చేసి ఉండచ్చు.  

More Related Stories