English   

మహిళా దినొత్సవం స్పెషల్ గా క‌థ‌నం టీజర్ !

Kathanam
2019-03-07 09:51:52

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్, నటుడు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కథనం”. గాయత్రి ఫిలింస్ , ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నరేందర్ రెడ్డి బట్టేపాటి, శర్మ చుక్కా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రాజేష్ నాదెండ్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం కథనం షూటింగ్ పార్ట్ పూర్తి కావొస్తోంది. టైటిల్ తగ్గట్టుగానే థ్రిల్లింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అనసూయ నటిగా తనలోని మరొ కొణాన్ని ఈ సినిమాలో చూపిస్తారని అంటున్నారు. అలాగే ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో మహిళా దినోత్సవం సందర్బంగా ఈ చిత్ర టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అన‌సూయతో పాటు ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇప్పటికే అనసూయ నటించిన క్షణం, రంగస్థలం సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమా కూడా హిట్ అయితే ఆమె హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతుంది. ఏమవుతుందో మరి.
 

More Related Stories