English   

అజయ్ భూపతి మహా సముద్రంలో సమంత !

samantha
2019-03-07 10:37:20

ఆర్ ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అజయ్ భూపతి. వర్మ దగ్గర అసిస్టంట్ గా సినీ లైఫ్ ప్రారంభించిన ఆయన కార్తికేయ పాయల్ రాజ్ పుట్ లను హీరో హీరోఇన్స్ గా తెరకెక్కించిన ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సంచలనాలు సృష్టించింది. ఆ సినిమా హిట్ కావడంతో ఆయనకు అనేక ఆఫర్స్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఏదీ కన్ఫాం చేయలేదు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన రోజు ఫంక్షన్ లో మెరవడంతో ఆయనతో సినిమా ఓకే అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఆయన మహా సముద్రం అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడట. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ఉంటుందని అంటున్నారు. విశాఖలో స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ స్మగ్లింగ్ కథలోనే అంతర్లీనంగా ఒక లవ్ స్టోరీ ఉంటుందని ఆరెక్స్ 100 మూవీలో లాగానే అనూహ్యమైన మలుపులు కూడా వుంటాయని అంటున్నారు. ఇందులో ఉన్న ఏకైక హీరోయిన్ పాత్ర కోసం సమంతను ఎంపిక చేసుకున్నట్టుగా ఫిలింనగర్ లో వార్తలు విన వస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తోపాటు మరో హీరో కూడా నటించనున్నట్లు టాక్.  

More Related Stories