English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘అవసరం’సాంగ్...టార్గెట్ బాబేనా ?

Lakshmis-NTR
2019-03-07 11:16:42

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితమలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయినప్పటి నుండీ జరిగిన పరిణామాలను బేస్ చేసుకుని వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఈ సినిమాని మార్చి 22న విడుద‌ల చేస్తానని ప్రకటించిన వర్మ విరివిగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ సిద్ధిపేట‌లో జ‌ర‌గుతున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఒక పక్క ఈ ప్యాచ్ వర్క్ జరుగుతుంటే వర్మ మరోపక్క ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీ అయ్యాడు. ఇక తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నుండి అవ‌స‌రం అంటూ సాగే ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. క‌ళ్యాణ్ మాలిక్ సంగీతం దర్శకత్వంలో రూపొందిన ఈ పాట‌కి సిరా శ్రీ లిరిక్స్ రాశారు. విల్స‌న్ హ‌రెల్డ్ పాడిన ఈ సాంగ్ లో సింగ‌ర్ వాయిస్ కాస్త ఘంట‌సాల వాయిస్‌ ని పోలి ఉండడంతో వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌ లో పాట‌ని షేర్ చేస్తూ ఈ పాట‌ని ఘంట‌సాల పాడ లేదని చెబుతూ పోస్ట్ పెట్టారు. రెండు నిమిషాల ద్యూరేషన్ తో ఉన్న ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు ఎన్టీఆర్‌ని ఏవిధంగా అవసరం ఉన్నంత వరకూ వాడుకుని ఎలా వదిలేశారనేదాన్ని హైలైట్ చేస్తూ చివర్లో లక్ష్మీ పార్వతి ఆయనకు తోడుగా నిలిచిన తీరును చూపించారు. అయితే ఈ పాటలో ఇందులో చంద్రబాబు రియల్ ఫొటోలను వాడుకున్నారు. ఇక ఇదే సాంగ్ చివరిలో రెండో ట్రైలర్‌ను మార్చి 8 రాత్రి 7.20 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో వ‌చ్చిన కధానాయకుడు మహానాయకుడు సినిమాలు అంతగా స‌క్సెస్ సాధించ‌క‌పోవ‌డంతో ఈ సినిమా మీద అంచనాలు బానే నెలకొని ఉన్నాయి. 

More Related Stories