English   

బాలయ్య-బోయపాటి ముహూర్తం కుదిరింది !

Balakrishna
2019-03-07 12:57:37

సినీ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ వేరు, వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి క్రేజీ కాంబినేషన్లలో నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ సినిమాలు బాక్స్ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్. అయితే దురదృష్టవశాత్తూ ఈ ఇద్దరి గత చిత్రాలు మాత్రం ఫ్లాప్స్ అయ్యి వారిని కాస్త నిరాశ పరిచాయి. ఎన్టీఆర్ బయోపిక్ సీరీస్ లోని రెండు సినిమాలు బాలయ్యని,  చరణ్ తో చేసిన వినయ విధేయ రామ పరాజయం బోయపాటికి ఊహించని షాక్స్ ఇచ్చాయి. అయితే ఆ షాక్ నుండి తేరుకున్న ఇద్దరూ ఇప్పుడు మూడో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్ళే పనిలో పడ్డారు. అందుకే ఈ సినిమా ఘనంగా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసి, ఎన్నికల తరువాత జ్యూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళవచ్చనే యోచనలో బాలయ్య ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాలు రిలీజ్ కాకముందు బోయపటితో సినిమాని బాలయ్యే నిర్మిస్తానని ప్రకటించారు, మరి ఈ పరాజయాల తర్వాత ఈ సినిమాకి బాలకృష్ణనే నిర్మాతగా వ్యవహరిస్తారా? లేదా వేరే ఏదైనా బ్యానర్ కి గానీ అప్పగిస్తారా? అనే విషయంలో క్లారిటీ రావాలసి వుంది.

More Related Stories