English   

కార్తికేయకు కొండంత బాధ్య‌త అప్ప‌గించిన రాజ‌మౌళి.. 

RRR
2019-03-07 08:31:41

రాజమౌళి తన సినిమా విషయంలో అస్సలు రిస్క్ తీసుకోడు. ఏ విషయమైనా తానే దగ్గరుండి చూసుకుంటాడు. లేదంటే తన కుటుంబ సభ్యులకు అప్పగిస్తాడు. అంతే కానీ బయటి వాళ్ల‌ను మాత్రం అస్సలు నమ్మడు దర్శకధీరుడు. ఎందుకంటే ఈయన సినిమాల బడ్జెట్లు కూడా ఇప్పుడు అలాగే పెరిగిపోతున్నాయి కాబ‌ట్టి. ఒక్కో సినిమా మీద వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. వాళ్ల న‌మ్మ‌కంతో ఆడుకోవ‌డం రాజ‌మౌళికి అస్స‌లు ఇష్టం ఉండ‌దు. దాంతో మరింత జాగ్రత్త పెంచేస్తున్నాడు జక్కన్న. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు అలియా భట్, పరిణీతి చోప్రా నటిస్తున్నార‌నే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎవరు క్లారిటీ అయితే ఇవ్వలేదు. పరిణీతి చోప్రా విషయంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ అలియా భ‌ట్ మాత్రం కచ్చితంగా రాజమౌళి సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది. 

ఈమెతో పాటు అజయ్ దేవ్ గ‌న్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి డేట్స్ చూసుకునే బాధ్యత తన తనయుడు కార్తికేయకు రాజమౌళి అప్పగించాడని తెలుస్తోంది. వాళ్ళు ఎప్పుడు షూటింగ్ కు రావాలి.. వాళ్ల డేట్స్ ఎప్పుడు అడ్జస్ట్ చేయాలి ఇవన్నీ కేవలం కార్తికేయ మాత్రమే చూసుకోబోతున్నాడు. అసలే ఇప్పుడు అలియా భ‌ట్ చాలా బిజీగా ఉంది. ఆమె డేట్స్ దొరకడం అనేది అసాధ్యం. అలాంటిది ఎలాగోలా ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చి తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు రాజమౌళి. దీనికి ఆయన తనయుడు కార్తికేయ‌ బాధ్యతగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. త్వరలోనే కేరళలో కొత్త షెడ్యూల్ కేర‌ళ‌లో మొదలు పెట్టనున్నారు రాజ‌మౌళి. అక్కడే 40 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.

More Related Stories