English   

ధరమ్ తేజ్ సినిమాకి షాకింగ్ ప్రీ రిలీజ్ ?

Chitralahari
2019-03-07 16:24:32

సాయిధరమ్ తేజ్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇంతకుముందు సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన 6 సినిమాలు పరాజయంపాలు కావడం వలన అయన గ్రాఫ్ పూర్తిగా దిగాజారడమే కాక ఆయన మారేక్ట్ కూడా కుదేలయ్యింది. ఆయన ఇప్పట్లో కోలుకోడనే అనుకున్నారు సినీ విశ్లేషకులు కానీ వారి విశ్లేషణలు తలకిందులు చేస్తూ ఆయన పాత సినిమాల ప్రభావం ఆయన కొత్త సినిమా మీద పడలేదు. ప్రస్తుతం ధరమ్ తేజ్ నేను శైలజ ఫేమ్ కిశోర్ తిరుమల డైరెక్షన్ లో చిత్రలహరి అనే మూవీలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా షూటింగ్ దశలోనే ఈ సినిమా సినీ ట్రేడ్ వర్గాల వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని వార్తలు వస్తున్నాయి. హీరోగా సాయికి అసలు హిట్లే లేకపోయినా దర్శకుడిగా కిషోర్ తిరుమలపై గల నమ్మకంతో పాటు ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ పై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా ఈ స్థాయి బిజినెస్ చేసిందనే టాక్ ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా సరిగమ సినిమాస్ అనే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, చిత్రలహరి ఓవర్సీస్ రైట్స్ దక్కించుకుందని అంటున్నారు. అక్కడ కూడా భారీ రేటుకే చిత్రలహరి రైట్స్ అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు.  అయితే రీసెంట్ గా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి సినిమాలతో మైత్రి వాళ్ళకి పెద్ద దెబ్బే పడింది. ఈ సినిమా ఇంత ప్రీ రిలీజ్ జరగడం అంటే వారికి ఊరట నిచ్చినట్టే. 

More Related Stories