English   

బాలీవుడ్ హీరోయిన్ పై భ‌ర్త రాక్ష‌స‌త్వం.. పోలీస్ స్టేష‌న్ లో కేస్.. 

Arzoo-Govitrikar
2019-03-07 10:07:50

ఈ రోజుల్లో గృహహింస కేసులు రోజుకు కొన్ని వందలు నమోదవుతున్నాయి. అందులో సాధారణ గృహిణి లే కాకుండా సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఒక బాలీవుడ్ హీరోయిన్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తన భర్త చేతిలో తన్నులు తిని ఆయన పెట్టే చిత్ర హింసలు భరించలేక పోలీస్ స్టేషన్ కు వచ్చి అతడిపై కేసు ఫైల్ చేసింది ఆ హీరోయిన్. బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తుంది ఈ ఇష్యూ. అంతగా సంచలనం సృష్టించిన ఆ ముద్దుగుమ్మ పేరు అర్జూ గోవిత్రికర్. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించిన అదితి గోవిత్రికర్ గుర్తుంది కదా.. ఆమె చెల్లెలు ఈ అర్జు. కొన్ని హిందీ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించింది ఈమె. అర్జూకు పదేళ్ల కింద సిద్ధార్థ్ తో పెళ్లయింది. కొన్ని రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత అతని నిజస్వరూపం బయట పెట్టాడు. రోజు ఆమెకు చిత్రహింసలు చూపించాడు. మానసికంగా శారీరకంగా తను చాలా హింస పెడుతున్నాడు అంటూ సిద్ధార్థ్ నుంచి బయటకు వచ్చేసింది అర్జు.  ఐదేళ్లుగా ముంబైలోనే ప్రత్యేకంగా ఒక ఫ్లాట్ తీసుకుని అందులో ఉంటుంది. వీళ్లకు ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అప్పుడప్పుడు ఆ కుర్రాడి కోసం వచ్చి బలవంతంగా తనను తీసుకెళ్తున్నారని.. అడ్డొచ్చిన తనను తాగివచ్చి కొడుతున్నాడని కేస్ ఫైల్ చేసింది ఈమె. పోలీస్ స్టేషన్ కు అక్క అదితితో పాటు వచ్చింది అర్జు. వీడియో ఫుటేజ్ కూడా ఉండటంతో పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. అందులో ఆమెను కొట్టి బాత్రూమ్ కు ఈడ్చుకెళ్తున్న‌ట్లు క్లియ‌ర్ గా ఉండ‌టంతో పోలీసులు ఫైర్ అవుతున్నారు. అయితే సిద్ధార్థ మాత్రం మ‌రోలా చెబుతున్నాడు. ఆ రోజు అర్జూ సీరియల్ రిహార్సల్స్ చేస్తుందని తనను కొట్టమంటే కొట్టాను అంటున్నాడు. ఈ ఇద్దరి వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది.

More Related Stories