English   

వైసీపీలోకి జయసుధ...జగన్ ఇష్టమట ?

Jayasudha
2019-03-07 10:16:29

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షపార్టీ వైసీపీలో చేరికలు ఊపందుకున్నాయి. ఒకవైపు కీలకనేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్ సినీ గ్లామర్‌ ను కూడా పార్టీకి ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నాగార్జున, సుమంత్, మంచు విష్ణు, మోహన్ బాబు, తదితరులు జగన్‌ కి టచ్‌ లోకి వెళ్ళగా టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ అయితే వైసీపీ కండువా కప్పుకుని కీలకపదవి చేపట్టి రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇక పోసాని, భాను చందర్, విజయ్ చందర్‌ తదితరులు వైసీపీ పార్టీకి మద్దతు ప్రకటించారు. తాజాగా సీనియర్ నటి జయసుధ జగన్ సమక్షం లో వైసీపీ కండువా కప్పుకున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి కారణం రాజశేఖర్ రెడ్డి అని, మళ్ళీ మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లనని నిర్ణయం తీసుకున్నానని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు సేవ చేద్దామని వైస్ కుటుంబ సభ్యురాలిగా వైసీపీలో జాయిన్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఎక్కడి నుండి పోటీ చేయడం అనే అంశం పై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంతా జగన్ ఇష్టమని చెప్పిన ఆమె, జగన్ ఆదేశాల మేరకు పార్టీ కోసం, పార్టీ ని బలోపేతం చేయడం కోసం పనిచేస్తానని అన్నారు. వైఎస్ బతికుండగా ఆమె 2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికై 2014 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. అనంతరం 2016లో టీడీపీ పార్టీలో చేరారు. అయినా ఆమె క్రియాశీలకంగా వ్యవహరించలేదు. ఇప్పుడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

More Related Stories