English   

గంగూలీతో పెళ్లి.. కానీ అలా జ‌రిగిందంటున్న న‌గ్మా.. 

Nagma
2019-03-07 10:22:55

సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా దుమ్ము దులిపేసింది నగ్మా. స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలతో కూడా నటించింది. అయితే అప్పుడెప్పుడో 15 ఏళ్ల కింద ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు తర్వాత ఇప్పటివరకు మళ్లీ తెలుగు సినిమాలో కనిపించలేదు ఈమె. ఈ మధ్యే మళ్ళీ మీడియా ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలా విషయాలు అభిమానుల‌తో పంచుకుంది. అందులో ముఖ్యంగా తన పెళ్లి విషయం కూడా చెప్పింది. న‌గ్మాకు అప్పట్లో ఇండియన్ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో నాకు ఎఫైర్ ఉందని చాలా రోజులు వార్తలు వినిపించాయి. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఈ విష‌యంపై ఇద్దరూ ఎప్పుడూ వాళ్లకు వాళ్ళు స్వయంగా స్పందించలేదు. ఇన్నాళ్ళకు ఈ విషయంపై ఓపెన్ అయ్యింది న‌గ్మా. అప్పట్లో తనకు గంగూలీ తో ఎఫైర్ ఉందనేది వాస్తవం కాద‌ని.. ఇద్దరం ప్రేమించుకున్న మాట వాస్తవమే అని చెప్పింది. ఒక సమయంలో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నామని.. కానీ అది ఇద్దరి కెరీర్ పై ప్రభావం చూపిస్తుందని వెనక్కి తగ్గమని చెబుతుంది న‌గ్మా. ముఖ్యంగా తన కంటే కూడా అప్పటికి క్రికెటర్ గా గంగూలీకి ఉన్న ఇమేజ్ పాడు కాకూడదని పెళ్లి చేసుకోలేదని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా అంటే పెళ్లి అనేది మన చేతుల్లో లేని విషయం.. దాని గురించి ఆలోచించడం అనవసరం అంటుంది. అయితే ఇప్పుడు తాను పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది మాత్రం చెప్పలేదు ఈ 45 ఏళ్ల హీరోయిన్. త్వరలోనే మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి రాబోతుంది న‌గ్మా. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

More Related Stories