English   

అమ్మాయిల‌ను ప‌డుకోబెట్టే వాళ్లు ఎవ‌రు శ్రీ రెడ్డి..? 

Sri-Reddy
2019-03-07 17:48:29

ఇప్పుడు ఇదే ప్ర‌శ్న ఆమెకు వ‌స్తుంది.. ఎందుకంటే ఫేస్ బుక్ లో ఈమె పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తుంది. అమ్మాయిల్ని పడుకో పెట్టే వాళ్లను, క్రిమినల్స్ ను మా అసోసియేషన్ ఎన్నికల నుంచి బ్యాన్ చేయండి.. వాళ్లను అస్సలు గెలిపించొద్దు.. అంటూ తాజాగా తన ఫేస్ బుక్ లో శ్రీ రెడ్డి పోస్ట్ చేసింది. ఈమె ఎవరిని ఇంత దారుణమైన మాటలు అన్నది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఓ వైపు శివాజీరాజా, శ్రీకాంత్ ప్యానల్ మరోవైపు సీనియర్ నరేష్, జీవిత రాజశేఖర్ ప్యానెల్ ఈ మా ఎలక్షన్స్ లో పోటీ పడుతున్నాయి. ఇందులో శివాజీరాజా చాలా మంచి వ్యక్తి అని ఆయనను గెలిపిస్తే మా అసోసియేషన్ కి మంచి జరుగుతుంద‌ని చెబుతుంది శ్రీ రెడ్డి. కచ్చితంగా ఆయనకే ఓటు వేసి మరోసారి అధ్యక్షుడిగా గెలిపించండి అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. గ‌తంలో ఈమెకు మా మెంబ‌ర్ షిప్ ఇప్పించింది కూడా శివాజీ రాజానే.

అది గుర్తు పెట్టుకుని ఇప్పుడు తన మద్దతు శివాజీరాజాకు ఉంటుందని చెప్పింది ఈమె. ఇదే సమయంలో అమ్మాయిలను సప్లై చేసే వాళ్లకు క్రిమినల్స్ కు మా అసోసియేషన్ బాధ్యతలు అప్పగించకండి అంటూ సంచలన ఆరోపణలు చేసింది ఈ ముద్దుగుమ్మ. జీవిత రాజశేఖర్, నరేష్ పేరు పెట్టకుండా వాళ్లని అమ్మాయిల సప్లయర్స్ అనేసింది శ్రీరెడ్డి. దాంతో ఇప్పుడు అసలు రచ్చ మొదలైంది. ఎందుకంటే ఆ మధ్య ఉద్యమం జరుగుతున్నప్పుడు జీవిత రాజశేఖర్ పై ఇలాంటి ఆరోపణలు చేస్తే ఆమె మీడియా ముందుకు వచ్చి శ్రీరెడ్డిని ఉతికి ఆరేసింది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అంటూ వార్నింగ్ ఇచ్చింది జీవిత. ఇప్పుడు మరోసారి అదే మాట అనేసింది శ్రీ రెడ్డి. దాంతో ఇప్పుడు పరిస్థితులు ఎక్కడికి వెళ్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 10న మా అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి.

More Related Stories