English   

చిరంజీవి క్లాస్ ప‌ని చేసింది.. సైరా షూటింగ్ లో జోరు పెరిగింది.. 

chiranjeevi
2019-03-07 12:13:47

చిరంజీవి క్లాసు తీసుకున్న తర్వాత సైరా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం కచ్చితంగా ఇదే ఏడాది విడుదల కావాలని దర్శకుడు సురేందర్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మెగాస్టార్. ఈ మధ్య ఇది బాగా హైలైట్ అయింది కూడా. సినిమా షూటింగ్ జరుగుతున్న తీరుపై మెగాస్టార్ చాలా అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఔట్ పుట్ అద్భుతంగా వస్తున్నా కూడా అది సరైన సమయానికి రాకపోతే సినిమా ఫలితంపై అది ప్రభావం చూపించే అవకాశం ఉందని చిరంజీవికి బాగా తెలుసు. ఎందుకంటే గతంలో అంజి సినిమా విషయంలో ఇలాంటి పరిస్థితి ప్రాక్టిక‌ల్ గా చూసాడు చిరంజీవి. ఆ సినిమా బాగున్నా కూడా కేవ‌లం ఆల‌స్యం కార‌ణంగా డిజాస్ట‌ర్ అయింది. అందుకే ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న సైరా నరసింహారెడ్డి విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు మెగాస్టార్. 

సినిమాకు అద్భుతమైన క్రేజ్ ఉంది కాబట్టి అది ఉన్నప్పుడే విడుదల చేయాలని పట్టుబడుతున్నాడు చిరంజీవి. మీరేం చేస్తారో తెలియదు కచ్చితంగా సినిమా దసరాకు విడుదల కావాల్సిందే అంటూ ఇప్పుడు చిత్ర యూనిట్ కు చిరంజీవి అల్టిమేటం పెట్టేసాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోకాపేటలో జరుగుతోంది. జగపతి బాబు, చిరంజీవి మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. మార్చి 10న ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. తర్వాత మరొక చిన్న షెడ్యూల్ బాకీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలోనే టాకీపార్ట్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు సురేందర్ రెడ్డి. ఆ తర్వాత కేవలం నాలుగు నుంచి ఐదు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఏదో ఒకటి చేసి సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. దీని కోసం అహర్నిశలూ కష్టపడుతున్నాడు.

More Related Stories