English   

అర్జున సినిమా వైఎస్ గురించా....ఆ లుక్స్ కి అర్ధం అదేనా ?

Arjuna
2019-03-08 10:30:38

అంకుశం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన డాక్టర్ రాజశేఖర్ ఆ తర్వాత పలు యాక్షన్ చిత్రాల్లో నటించారు. అయితే ఆయన నటించిన చిత్రాలు వరుస ఫ్లాపులు రావడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. దాదాపు కొన్నేళ్ళు గ్యాప్ తర్వాత గరుడవేగ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. హాలీవుడ్ తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా రాజశేఖర్ మళ్ళీ నిలబడ్డాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు చేయనున్న సినిమాల విషయంలో పక్కా ప్లాన్‌తో ఉన్నాడు. ప్రస్తుతం రాజశేఖర్ ఆ సినిమా ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ ‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రేక్షకుల ఈ సినిమా కొస ఎదురుచుస్తుండగా ఆయన అర్జున అనే సినిమా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. తమిళ దర్శకుడు కణ్మణి తెరకెక్కించిన ఈ చిత్రం ఎపుడో విడుదల కావాల్సింది. అప్పటికే హీరోగా రాజశేఖర్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిన  ఈ సినిమాను విడుదల చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అయితే ఈ మధ్య ఎప్పుడో మాటల సందర్భంలో ఈ విషయాన్ని నిర్మాత సీ కళ్యాణ్ వద్ద ప్రస్తావించగా ఆయన ఈ సినిమా విడుదల చేయడానికి రెడీ అయ్యారట.

అర్జున  సినిమాలో రాజశేఖర్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసాడట,ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసారు. పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాలో లుక్స్ చూస్తే ఎందుకో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ స్పురణకు వస్తున్నారు. వైఎస్ మరణానంతరం రాజశేఖర్ దంపతులు జగన్ వెంట నడిచారు, జగన్ రాజశేఖర్ ను కళ్ళజోడు కోసం ఏదో అన్నారని వీరు అక్కడి నుండి బయటకు వచ్చేశారు, ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు. అయితే జగన్ అప్పట్లో తమను అవమానించారని చెబుతూ ఉండేవారు. మరి ఈ సినిమాలో లుక్స్ వైఎస్ ని, వైఎస్ జగన్ ని పోలి ఉండడంతో అనేక అనుమానాలు మొదలువుతున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయితే కానీ యా డౌట్స్ క్లియర్ అవ్వవు మరి.

More Related Stories