English   

మ‌హేష్ అభిమానుల‌కు తీపిక‌బురు.. టీజ‌ర్ తేదీ కన్ఫ‌ర్మ్..

Mahesh Babu Maharshi teaser release on march 21st
2019-03-08 10:35:00

మహర్షి సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. మార్చి 17తో టాకీపార్ట్ పూర్తి కానుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత దిల్ రాజు కన్ఫర్మ్ చేశాడు. ఇక ఈ సినిమా విషయంలో మహేష్ బాబు కాస్త అసంతృప్తిగా ఉన్న కూడా సినిమా అవుట్ పుట్ చూసి ఆనందంగా ఫీలవుతున్నాడు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది మహర్షి. ఇక ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్, ఫస్ట్ లుక్ తేదీలను కూడా నిర్మాత దిల్ రాజు కన్ఫర్మ్ చేసాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం మార్చి 21న మహర్షి సినిమా టీజ‌ర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే కొన్ని సార్లు వాయిదా పడటంతో తెలియకుండానే మహర్షి సినిమాపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. దాన్ని తగ్గించి మళ్ళీ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తీసుకురావడానికి విడుదలకు దాదాపు నెల రోజుల ముందే టీజ‌ర్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇది కాస్త రిస్క్ అని తెలిసినా కూడా ధైర్యం చేస్తున్నారు. దాదాపు నిమిషం నిడివి ఉండే టీజ‌ర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు యూనిట్. ఇది చూసిన త‌ర్వాత క‌చ్చితంగా అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆనందంగా ఫీల్ అవుతారని.. సినిమాపై అంచనాలు పెరుగుతాయని వాళ్లు భావిస్తున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కామెడీ హీరో అల్లరి నరేష్ ఈ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. దిల్ రాజుతో పాటు పివిపి, అశ్వనీదత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే లో దిల్ రాజు విడుదల చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు విజయం సాధించాయి. కానీ మహేష్ బాబుకు మాత్రం మే కలిసి రాలేదు. అయితే ఇప్పుడు కచ్చితంగా ఈ లోటు భర్తీ చేస్తాన‌ని చెబుతున్నాడు సూపర్ స్టార్.

 

More Related Stories