English   

కన్నీళ్లు పెట్టిన శివాజీ రాజా !

Sivaji-Raja
2019-03-08 17:53:16

తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ఎన్నికలు రణరంగాన్ని ని తలపిస్తున్నాయి. ఈ నెల పదవ తేదీన జరగాల్సిన ఎన్నికల్లో ఈసారి రెండు ప్యానెల్స్ పోటీ పడుతున్నాయి. అందులో ఒకటి గత రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన శివాజీ రాజా ప్యానెల్ కాగా మరొకటి గత రెండు నెలలుగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ నటుడు నరేష్ ప్యానెల్. గత కొద్దిరోజులుగా మీడియా ముందుకు వస్తున్న నరేష్ శివాజీ రాజా చేసిన అవినీతి వల్లే తాను పోటీలో దిగాల్సి వస్తుందని అర్థం వచ్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని అభిప్రాయ భేదాలు వల్లే పోటీకి దిగుతున్నట్లు ఆయన ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శివాజీ రాజా ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. తమ మీద అనవసరంగా నరేష్ ఆరోపణలు చేసుకున్నారని శివాజీ రాజా పేర్కొన్నారు. మా లో గొడవలు ఇంతలా దిగజారి పోతాయని ఊహించలేదని తాను ఎన్నడూ స్వలాభం కోసం ఏమీ చేయలేదని, ఇప్పుడు ఈ నిందలు వేస్తూ ఉంటే బాధగా ఉందని చెబుతూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. తాజాగా తన పుట్టినరోజును కూడా తన ఆఫీసుకు వస్తానని నరేష్ మెసేజ్ పెట్టాడని ఆయన కోసం మిగతా పనులన్నీ క్యాన్సిల్ చేసుకుని ఎదురుచూస్తే రెండు గంటలపాటు వెయిట్ చేయించి ఆలయ మెసేజ్ పెట్టాడని అన్నారు. పైగా రివేంజ్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూసారా అని ఆఫీస్ స్టాఫ్ తో అన్నారని శివాజీ రాజా ఎమోషనల్ అయ్యారు. అలాంటి వ్యక్తికి అధికారం రాకూడదని మళ్లీ పోటీలో నిలబడినట్లు శివాజీ రాజా పేర్కొన్నారు. ఒకరకంగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికలు తలపిస్తూ హీట్ ని పెంచేస్తున్నాయి

More Related Stories