English   

మజిలీ శాటిలైట్ రైట్స్ మీద క్రేజ్... ఎందుకబ్బా ?

Chaitanya
2019-03-08 11:32:36

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్యలు వివాహం అయ్యాక కలిసి మజిలీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకునే పనిలో పడ్డారట మేకర్స్. అయితే నాగ చైతన్యకి గత సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఉంటుందని భావించారట, అయితే ఈ సినిమాలో సమంతా తోడవ్వడం డైరెక్టర్ కి కూడా క్రేజ్ ఉండడంతో బిజినెస్ కూడా అంచనాలకు మించి జరుగుతోందట. ఇప్పటికే డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైం 3.5కోట్లకు సొంతం చేసుకోగా, హిందీ డబ్బింగ్ రైట్స్ సుమారు 4కోట్లకు అమ్ముడుపోయాయట. తాజాగా శాటిలైట్ రైట్స్ ను కూడా జెమినీ టీవీ 5కోట్లకు కొనుగోలు చేసిందని అంటున్నారు. దీంతో ఇప్పటికే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్స్ ను చేరుకున్నట్టు టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది, ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ విడుదలై అందరిని ఆకట్టుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. మరి, ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక వెనకబడ్డ నాగచైతన్య కెరీర్ ను మజిలీ సినిమా ఎలాంటి మజిలీ అవుతుందో వేచి చూడాలి మరి.

More Related Stories