English   

వ‌ర్మ వెన‌క‌డుగు వేసాడా.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రెండో ట్రైల‌ర్ లో..? 

Lakshmis-ntr
2019-03-08 12:23:38

రాంగోపాల్ వర్మ వెనుకడుగు వేశాడా.. తొలి డ్రైవర్ తో పోలిస్తే రెండో ట్రైలర్ లో ఎందుకు అంత మసాలా చూపించలేకపోయాడు వర్మ.. ఇప్పుడు ఇదే అనుమానం అందరిలోనూ కనిపిస్తుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదట విడుదల చేసిన ట్రైలర్ లో పూర్తిగా చంద్రబాబు నాయుడుని విలన్ గా చూపించాడు రాంగోపాల్ వర్మ. కానీ రెండో ట్రైలర్ లో మాత్రం ఎన్టీఆర్ పై కూడా విమర్శలు గుప్పించాడు. ఎన్టీఆర్ పూర్తిగా కీలుబొమ్మగా మారిపోయాడ‌ని.. లక్ష్మీపార్వతి చేతిలో ఆయన ఆడుకుంటున్నాడని.. అలాంటి వాడి చేతిలో పార్టీ ఉంటే సర్వనాశనం అయిపోతుందని డైలాగులు ఇప్పుడు విడుదలైన ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి అప్పుడు వాస్తవ పరిస్థితులను కూడా సినిమాల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ. అప్పుడు కానీ నిజంగానే ఎన్టీఆర్ నుంచి అధికారం చంద్రబాబు నాయుడు తీసుకోకపోతే ఉంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉండేది కాదని.. ఉండేది కేవలం లక్ష్మీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని అప్పటి విశ్లేషకులు కూడా చెప్పారు. 

అప్పుడు ఏం జరిగిందో అదే విషయాన్ని ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపిస్తున్నాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అందులో చంద్రబాబు నాయుడు ఎందుకు వెన్నుపోటు వలసిన అవసరం వచ్చింది అనేది కూడా చూపించబోతున్నాడు ఈ దర్శకుడు. అయితే దాన్ని ఏ కోణంలో చూపిస్తాడనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఆయన చూపించే తీరును బట్టి చంద్రబాబునాయుడు హీరోనా విలనా అనేది అర్థమవుతుంది. నా కొడుకు లోకేష్ పై ఒట్టు అనే డైలాగ్ లు కూడా ఈ సినిమాలో వాడాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. మొత్తానికి ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగి పోవడం ఖాయం. మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నింటికీ తెగించి రామ్ గోపాల్ వ‌ర్మ ఈ సినిమా తెరకెక్కించాడని విషయం క్లియర్ గా మన కళ్లముందు కనిపిస్తుంది. మ‌రి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ విడుద‌ల త‌ర్వాత ఏం మాయ చేస్తుందో చూడాలి.

More Related Stories