English   

జెర్సీ సినిమా ఆ క్రికెటర్ జీవితం ఆధారంగా వ‌స్తుందా..?

Nani Jersey movie based on indian cricketer raman lamba life
2019-03-08 13:09:08

జెర్సీ సినిమా మాజీ క్రికెటర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుందని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో లేనిపోని రూమర్స్ దర్శక నిర్మాతలను కంగారు పెడుతున్నాయి. ఇప్పటికే జెర్సీకి రెండు క్లైమాక్స్ లు షూట్ చేశారని.. అందులో ఏదో ఒకటి ఎంచుకోవడానికి దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సాయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. వీటిపై వెంటనే స్పందించింది చిత్రయూనిట్. ఇందులో ఎవరు ఎలాంటి సహాయం చేయడం లేదని.. సినిమా కథ రాసుకున్నపుడే క్లైమాక్స్ కూడా ఫిక్స్ అయిపోయిందని చెబుతున్నారు. అది నానికి కూడా బాగా నచ్చిందని.. మరో ఆలోచన లేకుండా క్లైమాక్స్ అదే ఉండాలని నాని కూడా చెప్పినట్లు వారు చెబుతున్నారు. ఇక ఇప్పుడు మరో వార్త కూడా జెస్సి సినిమాపై వినిపిస్తుంది. ఈ సినిమా మాజీ క్రికెటర్ రమన్ లాంబ జీవితం ఆధారంగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతుంది.
80ల్లో ఈయన ఒక సంచలన క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు. రంజీ ట్రోఫీలో అద్భుతాలు చేశాడు రమన్ లాంబ‌. అయితే ఇండియన్ క్రికెట్ కు మాత్రం కోరుకున్న స్థాయిలో సేవలు అందించలేకపోయాడు. ఇప్పుడు జెర్సీ సినిమా కథ కూడా ఇలాగే ఉండబోతుంది. జీవితంలో పనికిరాడు అనుకున్న ఒక క్రికెటర్ తన కలను సాకారం చేసుకున్నాడు అనేది ఈ చిత్ర కథ. ఇక ఈ సినిమాలో నెగటివ్ ఎండింగ్ ఉంటుందని తెలుస్తోంది. 1998లో ఢాకాలో జ‌రుగుతున్న ఒక మ్యాచ్ లో బాల్ త‌గిలి కన్నుమూసాడు లాంబ‌. ఇప్పుడు జెర్సీ సినిమాలో కూడా ద‌ర్శ‌కుడు గౌతం తిన్ననూరి నెగిటివ్ ఎండింగ్ రాసుకున్నాడని తెలుస్తోంది. దీన్ని బట్టి ఇది రమణ్ లాంబా జీవితం అని అర్థమవుతుంది. మరి ఇది నిజమా కాదా అనేది ఏప్రిల్ 19 వరకు ఆగితే తెలుస్తుంది.

More Related Stories