English   

కధనం టీజర్...సినిమా రైటర్ గా అనసూయ !

Anasuyas-Kathanam
2019-03-08 13:26:34

అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్రధాన ప్ర‌ధాన పాత్ర‌లో రాజేష్‌ నాదెండ్ల అనే డెబ్యూ డైరెక్టర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో మంచి స్పందన రాగా, నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ టీజర్ ని మెగా పవర్ స్టార్ సతీమణి కొణిదెల ఉపాసన విడుదల చేశారు. ఈ టీజ‌ర్ ని బట్టి చూస్తే ఇందులో అనసూయ ఒక సినిమా కధ రాసి దాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆమె సిన్మాకి కధ రాసినట్టే అది బయట హత్యలు జరుగుతుంటాయి.

ఈ టీజర్ చూస్తుంటే తెలియ‌కుండానే 16 ఏళ్ల కింద వ‌చ్చిన ఏ ఫిల్మ్ బై అర‌వింద్ క‌థ‌ను గుర్తు చేస్తుంది. మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని విడుద‌లైన క‌థ‌నం సినిమా టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాను ఊహించుకుని రాసిన సంఘటనలు నిజంగానే జరుగుతూ ఉండటంతో, ఆమె భయాందోళనలకు లోనవుతూ ఉండటం ఈ టీజర్లో చూపించారు. 'నిర్ణయాలు తీసుకోవలసినవాళ్లు నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకరు మేల్కొంటారు సార్' అనే అవసారాల  శ్రీనివాస్ డైలాగ్ బాగుంది. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ వేసవి సెలవుల్లో సినిమాను ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

More Related Stories