English   

ప్రభాస్, ఎన్టీఆర్ అయ్యారు ఇక మహేష్ వంతు !

Prashanth Neel meets Mahesh Babu wife Namrata
2019-03-08 22:00:52

మన సినిమా గాసిప్స్ కి అంతే ఉండదు, అసలు కొందరు డైరెక్టర్ లు నిజంగా హీరోలను కలిసి కధ చెబుతారో లేదో తెలీదు కానీ మన వాళ్లు వార్తలు రాసి పారేస్తూ ఉంటారు. కన్నడ నాట సినిమా తీసి అన్ని బాషలలో రిలీజ్ చేసిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించిన వార్తలు కూడా అంతే.  యశ్ అనే కుర్ర హీరోను పెట్టుకుని అతను బాహుబలి లాంటి క్రేజ్ ని సంపాదించాడు. ఇప్పుడు ఇంత కస్టపడి తీసిన సినిమా తర్వాత వేరే సినిమా తీసి ఏమాత్రం తేడా పడినా ఎక్కడ మొదలయ్యదో మళ్ళీ అక్కడికే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే లాజిక్ ఆలోచించని వాళ్ళు మాత్రం ప్రశాంత్ తర్వాతి సినిమా ప్రభాస్‌తో అన్నారు. వీళ్ల కాంబినేషన్లో సినిమా కోసం ఓ కథ రెడీ అని వార్తలు వచ్చాయి. అవి సద్దుమనిగే లోపు జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరమీదికి తెచ్చారు. ఎన్టీఆర్ తన సొంత ప్రొడక్షన్లో ప్రశాంత్‌తో సినిమా చేస్తాడని ప్రచారం చేశారు. అది మరవక ముందే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మొదటి చిత్రానికి సీక్వెల్ గా కేజీఎఫ్-చాప్టర్-2 తీసే ప్రయత్నాల్లో ఉన్నాడని అది పూర్తయ్యాక మహేష్ బాబుతో ఓ ప్రాజెక్టు చేసేందుకు కూడా ప్రశాంత్ రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ తో ప్రాథమిక చర్చలు జరిపాడని, పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసి మళ్ళీ ఆమెను అప్రోచ్ అవుతారని వార్తలు వస్తున్నాయ. మరి మహేశ్ తర్వాత మరే హీరో పేరు వస్తుందో ఏమో చూద్దాం.

More Related Stories