English   

శింబు తమ్ముడి ప్రేమ పెళ్లి !

simbu brother kuralarasan is getting married
2019-03-08 22:11:53

తమిళ ఇండస్ట్రీలో ఈ ఏడాది వివాహ నామ సంవత్సరం లాగా ఉంది. ఇప్పటికే త‌మిళ హీరో ఆర్య‌- సాయేషా సైగ‌ల్‌ని ఈ నెల‌లోనే వివాహం చేసుకోనుండగా, విశాల్ త‌న పెళ్ళికి సిద్దం అవుతున్నాడు. ఇక తాజాగా వీరి కోవలో శింబు సోద‌రుడు కుర‌ల‌ర‌స‌న్ కూడా పెళ్లికి సిద్దం అవుతున్నట్ట్టు వినిపిస్తున్నాయి. త‌న ప్రేమ కోసం ఇటీవలే ఇస్లాం మ‌తం తీసుకున్న కుర‌ల‌ర‌స‌న్ తన ప్రేయసిని ముస్లిం సాంప్రదాయ పద్దతుల ప్రకార ఈ ఏప్రిల్ 26న పెళ్లి చేసుకోనున్న‌ట్టు స‌మాచారం. వీరి వివాహానికి కేవ‌లం స‌న్నిహితులు, బంధువులని మాత్ర‌మే ఆహ్వానించ‌నున్న‌ట్టు సన్నిహితుల ద్వారా తెలిసిన్దిది. పెళ్ళికి ఇంకా నెల రోజులే ఉండడంతో శింబు ఇంట పెళ్ళి కార్య‌క్ర‌మాలు జోరుగా జ‌రుగుతున్న‌ట్టు టాక్. బాల న‌టుడిగా ప‌లు చిత్రాల‌లో న‌టించిన కుర‌ళ‌ర‌స‌న్ సంగీతదర్శకుడిగా కూడా పనిచేశారు. ఓ ముస్లిం యువ‌తిని ప్రేమిస్తున్న కార‌ణంగానే కుర‌ళ‌ర‌స‌న్ ఇటీవ‌ల ఇస్లాం మ‌తంలోకి మారాడు. రాజేంద‌ర్ కుటుంబంలో శింబు శివ భక్తుడు కాగా, రాజేంద‌ర్ కూతురు ఇల‌ఖ్య ఇటీవ‌ల క్రైస్త‌వ మ‌తంలోకి మారి వివాహం చేసుకుంది. ఇక మిగిలింది శింబునే, ఆయన ఇప్పటికే చాల మంది హీరోయిన్స్ తో వ్యవహారాలు నడిపాడని టాక్. అవి నిజాలో కాదో తెలీదు కానీ మనోడు కూడా ఒకింటి వాడు అయితే రాజేంద్రన్ కి టెన్షన్ ఉండదు.

More Related Stories