English   

బాబుని కలిసిన కౌశల్...టీడీపీ నుండి పోటీ !

Kaushal
2019-03-09 00:31:47

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ కొద్దిరోజుల నుండి వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ఆర్మీ అంతా ఆర్గనైజ్డ్ ఆర్మీ అంటూ కొందరు వ్యక్తులు ఆయన్ని టార్గెట్ చేయగా ఆయన కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఆయన తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుని కలవడం చార్చనీయాంశంగా మారింది. సీఎం ని కలిసేందుకే అమరావతి వెళ్ళిన కౌశల్ నిన్న రాత్రి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలిశారు. చంద్రబాబుకు టీడీపీకి మద్దతు తెలిపిన కౌశల్ అవసరమైతే టీడీపీ తరపున ప్రచారానికి కూడా వస్తానని బాబుతో అన్నారట. దీంతో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి కౌశల్ ముందుకు రావడాన్ని ముఖ్యమంత్రి కూడా ఓకే చెప్పడంతి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున కౌశల్ ప్రచారం చేసే అవకాశం ఉంది. అలాగే త్వరలోనే తన భవిషత్తు కార్యాచరణను మీడియాకి ప్రకటిస్తానని సీఎంకు కౌశల్ చెప్పారట. అయితే కౌశల్ ని సీఎం దగ్గరకు తీసుకెళ్ళింది మంత్రి గంటా శ్రీనివాసరావు అని చెబుతున్నారు. ఇప్ప‌టికే కౌశ‌ల్ వైజాగ్ ఎంపీ సీటుకి పోటీచేయ‌నున్నార‌ని క‌థ‌నాలు వ‌స్తున్న నేపధ్యంలో సిఎంతో భేటీ కావ‌టం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కౌశల్ ఆర్మీ పేరిట కౌశాక్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీరు కౌశల్ విజయం సాదించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే కౌశల్ ఆర్మీకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉందని ఇప్పటి దాకా భావిస్తూ వచ్చారు. పవన్‌కు తాను భక్తుడినని చెప్పిన కౌశల్ గత ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత ఆయన్ను కలవాలని భావించినట్టు, ఇప్పటికీ దానికోసం వెయిట్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆయన బాబు చెంతకు చేరడం కీలకంగా మారింది.

More Related Stories