English   

గీత గోవిందం నిర్మాతల మీద ఐటీ రైడ్స్ ! 

Geetha-Arts
2019-03-09 09:35:55

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహేరోయిన్స్ గా నటించిన గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలయిన ఈ సినిమా 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అయితే, వసూళ్లను తక్కువ చేసి చూపి ఆదాయ పన్ను తక్కువ చూపారనే అనుమానంతో గీతగోవిందం నిర్మాతల ఆఫీసుల మీద ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిన్న సోదాలు నిర్వహించారట. బంజారాహిల్స్‌ లోని జీఏ 2 పిక్చర్స్‌ ఆఫీస్ కి వెళ్ళిన హైదరాబాద్ ఐటీ యూనిట్‌-14 అక్కడ సినిమా వసూళ్లకు సంబంధించిన వివరాలు, రికార్డులను పరిశీలించింది. దీని కలెక్షన్లు దాదాపు రూ.130 కోట్ల వరకు ఉంటుందని భావించిన ఐటీ అధికారులు, పన్ను చెల్లింపుల విషయమై కూపీ లాగారట. నిజానికి ఇది జీఏ2 అనే పేరుతో నడుస్తున్నా అరవింద్ అండర్ లోనే ఉంటుంది. కాకపోతే పెద్ద సినిమాలు మొదటి బ్యానర్ లో తీస్తూ చిన్న సినిమాలు మాత్రం ఈ రెండవ బ్యానర్ లో తీస్తున్నారు.  అందుకే ఈ బ్యానర్ లో నిర్మించిన రెండు సినిమాలకు సంబంధించిన రికార్డులను కూడా ఐటీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.  

More Related Stories