English   

నరేష్ ప్యానల్ కి మెగా సపోర్ట్ !

Naga-Babu
2019-03-09 10:42:38

రేపు జరగనున్న మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఆరోపణలు, విమర్శలతో ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారు. గత ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్న శివాజీరాజా, నరేష్‌లు ప్రత్యర్థులుగా ‘మా’ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఇక రేపే ఎన్నికలు జరగున్న తరుణంలో మాలో ప్రభావిత స్థాయి కలిగిన మెగా బ్రదర్ నాగబాబు నరేష్ ప్యానెల్‌ కు మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి దాకా ఎవరికీ మద్దతు ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్న ఆయన నరేష్, రాజశేఖర్ ప్యానెల్‌కు సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. నిన్న సాయంత్రం నాగబాబు మద్దతు కోరుతూ నరేష్ ప్యానెల్ సభ్యులు వెళ్లి కలిసారు. మా అధ్యక్ష పదవిని ఒకరు ఒకసారి మాత్రమే చేపట్టాలని, రెండోసారి చేపట్టడం తనకు ఇష్టం ఉండదని అందుకే తాను రెండోసారి మా అధ్యక్షుడిగా చేయడానికి నిరాకరించానని చెప్పిన నాగబాబు శివాజీ రాజా రెండేళ్లు అద్యక్ష్యుడిగా పనిచేసిన కారణంగా ఈసారి నరేష్, రాజశేఖర్‌కు మద్దతు ఇస్తున్నానని తెలిపారు. ఈ ప్యానల్‌లో జీవితకి మంచి పదవి ఇస్తుండటం ఆహ్వానించదగ్గ విషయమని మెగా బ్రదర్ చెప్పారు. మా అసోసియేష‌న్ గురించి ఎవ‌రు ప‌డితే వాళ్లు నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే వాళ్లు చూస్తుండిపోయారని శ్రీ రెడ్డి వ్యవహారాన్ని నాగబాబు పరోక్షంగా ప్రస్తావించారు.  
 

More Related Stories