English   

ఆర్ఆర్ఆర్ నుండి లేటెస్ట్ అప్డేట్...లీకిచ్చిన కీరవాణి !

RRR
2019-03-09 11:31:29

యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్‌, మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో జక్కన్నగా పేరుగాంచిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాని డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా, రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ దృష్ట్యా ఈ సినిమా మీద సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల గాసిప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమా బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంద‌ని మొదట, కాదు బ్రిటీష్ కాలం నాటి స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో అని తర్వాత ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా మీద మాత్రం కీరవాణి ఒక అప్డేట్ ఇచ్చారు అప్పట్లో, ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి నా ప‌ని మార్చి నుంచి మొద‌ల‌వ‌బోతందని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన, చెప్పినట్టుగానే పని మొదలు పెట్టినట్టు ట్వీట్ చేశారు, హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో మ్యూజిక్ పీరియాడిక్‌గా ఉండ‌బోతోందని ముందే చెప్పిన కీరవాణి ఈ సారి రాజమౌళి సినిమాకి ఎంత బలం అవనున్నారో అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి వార్త‌లు కాని, పోస్ట‌ర్స్ కాని అధికారికంగా కానీ లీకయినవి కానీ బ‌య‌ట‌కి రాకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్న జ‌క్క‌న్న మూవీ ఫ‌స్ట్ లుక్‌ని రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే ( మార్చి 27) రోజున విడుద‌ల చేయ‌నున్నార‌ని అంటున్నారు. బాహుబ‌లి చిత్రం స‌మ‌యంలో కూడా రాజ‌మౌళి ఆర్టిస్టుల బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పోస్ట‌ర్స్ విడుద‌ల చేస్తూ సినిమా మీద అంచ‌నాలు పెంచారు.  ఇక ఈ సినిమా 2020లో తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. 

More Related Stories