English   

బాలకృష్ణకు ఊహించని షాక్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ..

RGV
2019-03-09 12:03:57

ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పు అడిగాడంటొకడు వెనకటికి ఒకడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అసలే ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ కావడంతో బాలకృష్ణ చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన మరిన్ని సెటైర్లు వేశాడు రామ్ గోపాల్ వర్మ. అసలే మండిపోయి ఉన్న బాలకృష్ణకు పైనుంచి మరింత పెట్రోల్ పోస్తున్నాడు ఈ దర్శకుడు. తన మాటల తూటాలతో నందమూరి వారసుడు నిద్రలేకుండా చేస్తున్నాడు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్మ మాట్లాడిన మాటలు అందరికీ షాక్ ఇచ్చాయి. తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేయడానికి ప్రధాన కారణం నందమూరి బాలకృష్ణ అని చెప్పి షాక్ ఇచ్చాడు ఈ దర్శకుడు. మనం జీవితంలో ఏ పని చేయాలన్నా కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా దాని వెనకాల ఒక స్ఫూర్తి దాయకంగా ఉంటారు.. అది ఎలాగైనా కావచ్చు ఏదో ఒక సమయంలో వాళ్లు కనిపించడం వల్ల ఐడియా వచ్చి.. దాన్ని మనం కథగా రాసుకుని.. ఆ తర్వాత సినిమాగా తెరకెక్కిస్తాం అంటూ చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించడానికి ప్రధాన కారణం నందమూరి బాలకృష్ణ అని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. ఒకవేళ ఆ రోజు ఎన్టీఆర్ బయోపిక్ గురించి బాలకృష్ణ తన దగ్గరికి రాకపోయి ఉంటే తనకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా చేసే ఆలోచన వచ్చి ఉండేది కాదని.. తాను బాలకృష్ణ అడిగిన బయోపిక్ చేయకపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ అని ఒప్పుకున్నాడు వర్మ. మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మార్చి 22న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో వర్మ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

More Related Stories