English   

నన్ను భయపడితే నేను ఇంకా భయపెడతానంటున్న వర్మ..

Varma
2019-03-09 12:58:59

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల చేయకుండా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా.. ఇప్పటివరకు మీరు బెదిరింపులు ఎదుర్కొన్నారా.. ఇంకా వస్తున్నాయా.. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకు ఎదురయ్యాయి. జర్నలిస్టులు ఎంత సూటిగా ప్రశ్నలు అడిగితే.. అంతే సూటిగా సుత్తి లేకుండా సమాధానాలు చెప్పాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఈయన మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశారు కదా.. మీకు ఎవరినుంచైనా బెదిరింపులు వస్తున్నాయా అని మీడియా మిత్రులు అడిగితే.. టీవీలో మొరిగే వాళ్ల నుంచి మాత్రమే వస్తున్నాయి. వాళ్లను నేను టీవీ రౌడీలు అంటాను అంటూ సెటైర్లు వేసాడు వర్మ. ఇప్పటివరకు తనను భయపెట్టే బెదిరింపులు రాలేదని.. అయినా నిజంగా భయపెట్టే వాడు బెదిరించడని చేసి చూపిస్తాడని.. అలాంటి వాళ్లు మన దగ్గర లేరు అంటున్నాడు వర్మ. అసలు ఒక్క బెదిరింపు కూడా రాలేదా అంటే వస్తున్నాయి కానీ తాను బెదిరిపోయే బెదిరింపులు రావట్లేదని చెప్పాడు ఈ దర్శకుడు. ఒకవేళ నిజంగానే ఆ బెదిరింపులు వస్తే ఏం చేస్తారు అంటే.. తాను తిరిగి భయపెడతాను అంటూ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చాడు వర్మ. ఆయన చెప్పిన సమాధానాలకు ఒక్కసారిగా ఆడిటోరియం నవ్వులతో నిండిపోయింది. ఆ ఒక్క ప్రశ్నే కాదు చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు వర్మ. మీరు చెప్పేది నిజం అని జనాలు ఎందుకు నమ్మాలి అంటే ఆ రోజు ఎన్టీఆర్ జీవితంలో జరిగింది మొత్తం తను మంచం కింద పడుకొని విన్నాను అంటూ సెటైర్ వేసాడు వర్మ. ఎవరైనా ఏదైనా చేస్తే ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని.. ఇప్పుడు తాను చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కూడా ఒక నమ్మకంపైనే చేశానని.. నిజం చెప్పాను అని ఒక ఆత్మ సంతృప్తి తనకు ఈ సినిమా విషయంలో కలిగింది అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఏదేమైనా రిలీజ్ సమయంలో బెదిరింపులకు పాల్పడితే తిరిగి తాను కూడా భయపెడతాను అంటూ రెచ్చిపోతున్నాడు ఈ దర్శకుడు.

More Related Stories