English   

ఆడుతూ పాడుతూ పని చేస్తున్న మహేష్ బాబు..

Mahesh
2019-03-09 14:59:43

మహర్షి సినిమా విషయంలో ఈ మధ్యకాలంలో చాలా వార్తలు విన్నాం. ముఖ్యంగా విడుదల తేదీ వాయిదా పడటం మహేష్ బాబుకు అస్సలు నచ్చలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇలాంటి సమయంలో అభిమానుల్లో లేనిపోని అనుమానాలు కూడా వచ్చాయి. దాంతో వాటిని కంట్రోల్ చేయడానికి చిత్ర యూనిట్ ఇప్పటికే నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే మార్చి 21న మహర్షి సినిమా టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు. ఇదిలా ఉండగానే సినిమా షూటింగ్ లో ఎలాంటి అభ్యంతరాలు లేవని.. చాలా సజావుగా తమ చిత్రం షూటింగ్ జరిగిపోతుందని ప్రేక్షకులను నమ్మించడానికి సెట్స్ లో ఉన్న ఫోటోలు విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అక్కడ మహేష్ బాబుతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, కొరియోగ్రాఫర్ రాజు సుందరం, మిగిలిన చిత్ర యూనిట్ కూడా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబుపై ఒక పాట చిత్రీకరిస్తున్నారు. మార్చి 17తో మహర్షి సినిమా టాకీపార్ట్ పూర్తి కానుంది. మిగిలిన రెండు పాటలను ఇక్కడ సెట్స్ వేసి పూర్తి చేయనున్నారు దర్శక నిర్మాతలు. కొన్ని మాంటేజ్ షాట్స్ మాత్రం విదేశాల్లో తెరకెక్కించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 24 లోపు మహర్షి సినిమాలు మొత్తం పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు వంశీ పైడిపల్లి. మే 9న న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో కచ్చితంగా మహేష్ బాబు మరో సంచలన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. దిల్ రాజు కూడా ఇదే బల్లగుద్ది చెబుతున్నాడు. మరి వాళ్ళ నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

More Related Stories