English   

మా ఎన్నికల్లో అసలు ఎవరు గెలవబోతున్నారు.. ఎవరి సత్తా ఎంత.

MAA-elections
2019-03-09 09:25:14

మా అసోసియేషన్ ఎన్నికలు నిజమైన ఎన్నికలను తలపిస్తున్నాయి. అసలు రాజకీయాలు కూడా వీటి ముందు పనికి రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసుకుంటున్న విమర్శలు అలా ఉన్నాయి మరి. ఒకరి వర్గంపై మరొకరు నోరు పారేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా అసోసియేషన్ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. వాళ్ళ మాటల తూటాలతో టీవీలు పేలిపోతున్నాయి. అప్పటివరకు భాయి భాయి అనుకున్న వాళ్ళు.. ఆ తర్వాత నువ్వు ఎంత అంటే నువ్వు ఇంత అంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇప్పుడు నరేష్, శివాజీ రాజా వర్గం మధ్య కూడా ఇలాంటి మాటల యుద్ధమే నడుస్తోంది. తనను, మా అధ్యక్ష పదవిని నరేష్ అవమానించాడని.. అసలు ఆయనకు మాట్లాడే తీరు కూడా తెలియదు అంటూ మండిపడ్డాడు శివాజీ రాజా. చిరంజీవిని తప్పుదోవ పట్టించి ఈ ఎన్నికలు జరిగేలా చేస్తున్నారని శివాజీరాజా విమర్శలు గుప్పించాడు. అంతేకాదు తనను మా సభ్యులు రెండోసారి పోటీ చేయాలని కోరినందుకే తాను పోటీ చేస్తున్నానని.. అంతకంటే తనకు వేరే ఆశలు లేవని చెప్పాడు. ఈయన గెలిపిస్తే ఆరు నెలల పాటు మా కళాకారులకు ఉచితంగా నిత్యావసర సరుకులు ఇస్తానని.. అంతేకాదు పేద కళాకారులకు ప్రతి నెల 7500 రూపాయలు ఇస్తాను అంటున్నాడు. మరోవైపు నరేష్ కూడా మా ఎన్నికల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. దానికి తోడు ఈయనకు నాగబాబు సపోర్టు కూడా ఉండటంతో చిరంజీవి సపోర్టు ఇక్కడే ఉందనే విషయం ఇండస్ట్రీ మొత్తం అర్థమైపోయింది. ఈ ఒక్క నిర్ణయమే ఇప్పుడు నరేష్ ను మా అధ్యక్ష పదవి వైపు అడుగులు వేసేలా చేస్తుంది. నిన్నటి వరకు ఎలా ఉన్నా.. నాగబాబు బయటికి వచ్చి తన మద్దతు నరేష్ వర్గానికి ఉంది అని చెప్పడంతో చిరంజీవి కూడా అటువైపు ఉన్నాడని అందరికీ అర్థమైపోయింది. దాంతో ఆయనను కాదని ఇప్పుడు శివాజీరాజా వర్గాన్ని మా అధ్యక్ష పదవిలో కూర్చోబెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మరికొన్ని గంటల్లో మా అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. మరి అవి ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి.

More Related Stories