English   

ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదేనట !

Prabhas
2019-03-09 10:22:51

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ప్ర‌భాస్ పెళ్ళి విష‌యం కొన్నాళ్ళ నుండి మీడియాలో ఎంత హాట్ టాపిక్ అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.  ప్రభాస్ సినిమాల గురించే కాక పెళ్ళి గురించి కూడా చర్చ విపరీతంగా జరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు సంబంధాలు చూస్తున్నారు. తమ కుటుంబానికి తగ్గట్టుగా ఉండే వధువు వేటలో పడ్డారు.   ఆ మధ్య రాశి సిమెంట్స్‌ అధినేత భూపతి రాజు ప్రభాస్‌ పెద్దనాన్న కృష్ణం రాజును కలిసి హీరోతో ఆయన మనవరాలి పెళ్ళి గురించి మాట్లాడారని వార్తలు వచ్చాయి. అయిన దీని మీద అధికారిక ప్రకటన రాలేదు. అయితే నిన్న కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ పెళ్ళి గురించి స్పందించారు. ప్ర‌స్తుతం ప్రభాస్ చేస్తున్న రెండు సినిమాలు పూర్తైన త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్ళి చేసుకుంటాడ‌ని శ్యామ‌లా చెప్పుకొచ్చారు. ప్ర‌భాస్ సాహో చిత్రంతో పాటు జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాడు. సాహో చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుండ‌గా, మ‌రో చిత్రం కూడా ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ఈ ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ప్ర‌భాస్ పెళ్ళి పీట‌లెక్క‌నుండ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు. చూడాలి మరి ఆ అమ్మాయి ఎవరో ?

More Related Stories