English   

నాని గ్యాంగ్ లీడర్ పై చెలరేగుతున్న మరో వివాదం..

Gang-Leader
2019-03-09 18:12:32

విక్రమ్ కె కుమార్ సినిమా మొదలు కాకముందే చాలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన ఏ సినిమా కూడా వివాదాలలో ఇరుక్కోలేదు. నాని హీరోగా ఆయన ప్లాన్ చేస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ మొదలు కాకముందే చాలా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. అందులో ముఖ్యంగా ఈ చిత్ర టైటిల్ గ్యాంగ్ లీడర్ అని పెట్టడం మెగా అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఈ విషయంలో ఆ మధ్య మూడు నాలుగు రోజుల పాటు నానా రచ్చ చేసారు ఫ్యాన్స్. ఆ తర్వాత ఎవరి పని వాళ్లు చూసుకుంటున్నారు. దాంతో సినిమాపై వివాదం అంతా సద్దుమణిగిందని చిత్ర యూనిట్ కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్లకు మరో అనుకోని షాక్ తగిలింది. గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ తాము ఆరు నెలల కింద ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించామని మరో చిత్ర యూనిట్ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. 40 రోజుల షెడ్యూల్ కూడా పూర్తి చేశామని.. తమ సినిమా ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో తన సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పెట్టుకోవడం ఏంటి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మాణిక్యం మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా మోహన్ కృష్ణ అనే నిర్మాత ఆరు నెలల కింద గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. దేశానికి వెన్నుముక రైతు కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే గోదావరి జిల్లాలో 40 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ చేశారు. చిన్న సినిమానే అయినా కూడా ఈ సినిమా పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇలాంటి సమయంలో నాని సినిమాకు మళ్లీ గ్యాంగ్ లీడర్ టైటిల్ అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. దాంతో ఇప్పుడు ఆ చిన్న సినిమా దర్శక నిర్మాతలు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. అందుకే వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. మరి ఈ విషయంలో నాని, విక్రమ్ కె.కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
 

More Related Stories