English   

మంచి మనసు చాటుకున్న వెంకీ !

Victory Venkatesh Meets His Fan Suffering From Cancer
2019-03-09 15:07:10

మిగతా బాషల సినిమా నటుల సంగతి ఏమో కానీ మన వాళ్ళు మాత్రం అభిమానులు అన్నా వారితో మమేకమ అవ్వాలన్నా ముందు ఉంటారు. తమ కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులకి ప్రాణాల మీదకు వస్తే ఎంత దూరం అయినా వెళ్తున్నారు. ఈ కోవలో ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్, బన్నీ లాంటి వాళ్ళు అభిమానుల దగ్గరకి వెళ్లి రాగా ఇప్పుడు వెంకటేష్ కూడా కాలేయ(లివర్) కేన్సర్‌ తో బాధపడుతున్న ఓ అభిమాని ఇంటికెళ్లి పరామర్శించాడు. హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ శైలాజపురి కాలనీకి చెందిన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సురేశ్ మంచానికే పరిమితం అయ్యారు. కేన్సర్‌తో చిక్కిశల్యమయ్యాడు.  అభిమానులు సురేశ్ విషయాన్ని హీరో దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్ సురేశ్‌ ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసి కాస్త సమయం గడిపి ఆప్యాయంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతని చికిత్సకి సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్న వెంకీ ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని చెప్పారు.

More Related Stories