English   

రానా - రాజ్ తరుణ్ కాంబినేషన్ లో సినిమా !

rana daggubati joining hands with raj tarun
2019-03-10 08:46:50

కెరీర్ తొలినాళ్ళలో వరుస విజయాలను అందుకున్న రాజ్ తరుణ్, ఆ తరువాత సరైన కథలను ఎంచుకోకపోవడం వలనో అన్నీ ఓకే రకమయిన కదలనే ఎంచుకోవడం వలనో వరుసగా ఫ్లాప్ లని అందుకున్నాడు. ఆయనకి ఇక సినిమాలు దక్కడం కష్టమే అనుకుంటున్నా తరుణంలో ఆయన దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమా చేయడానికి ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఆ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే మరొక సరికొత్త కాంబినేషన్ ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే టాలీవుడ్ స్టార్ హీరో రానా నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రానా ఈ నిర్ణయానికి వచ్చాడని సమాచారం. అయితే మరాఠీలో సూపర్ హిట్టయిన ‘పోస్టర్ బాయ్స్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని అంటున్నారు. వేసవి తరువాత ఈ  సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. నిజానికి దీనిని తెలుగు, హిందీ బాషలలో ఒకేసారి తెరకేక్కిస్తున్నారట, తెలుగు వర్షన్ కి రానా, బాలీవుడ్ కి అక్షయ్ కుమార్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారట. తెలుగుకి హీరో దొరికినా హిందీ వర్షన్ కి మాత్రం హీరోని వెతికే పనిలో ఉన్నారట అక్షయ్ కుమార్.

More Related Stories