English   

మొదలయిన పెళ్లి సందడి !

Sayyeshaa Saigal And Arya's Pre-Wedding
2019-03-10 08:59:48

త‌మిళ‌ హీరో హీరోయిన్స్ ఆర్య‌ స‌యేషా సైగ‌ల్‌ లు రేపు వివాహ బంధంతో ఒక్క‌టి కానున్న సంగ‌తి తెలిసిందే. ముందు నుండి ఈ జంట ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినా వ్యాలంటైన్స్ డే సంద‌ర్భంగా త‌మ‌ పెళ్లి విష‌యంపై క్లారిటీ ఇచ్చిన ఈ జంట మార్చిలో తమ వివాహం జరగుందని ప్రకటించారు. పెళ్లి ఈ నెల పడవ తేదీన అని తెలుస్తుడగా ప్ర‌స్తుతం వీరింట ప్రీ వెడ్డింగ్ వేడుక‌లు మొద‌ల‌య్యాయి. రీసెంట్‌ గా నిర్వ‌హించిన సంగీత్ కార్య‌క్ర‌మంలో బాలీవుడ్ సెల‌బ్రిటీలు సంజ‌య్ ద‌త్‌, ఖుషీ క‌పూర్‌, ఆదిత్యా పంచోలితో పాటు మరికొందరు సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. కోలీవుడ్ లో రాణిస్తున్న సాయేశా ఇంటికి బాలీవుడ్ సెలెబ్రిటీలు ఏమిటా అనుకుంటున్నారా ? స‌యేషా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టులు సుమీత్ సైగల్ మరియు షాహీన్‌ల కూతురు కాగా, దిలీప్ కుమార్, సైరా భానుల మ‌న‌వ‌రాలు అన్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఈ బాలీవుడ్ మెరుగులు అన్నమాట. ఏమాటకు అమాటే చెప్పుకోవాలి గులాబి రంగు లెహంగా ధ‌రించిన సాయేషా ధగధగా మెరిసిపోతోంది. హైద‌రాబాద్‌లో ఆర్య‌, స‌యేషాల పెళ్లి వేడుక జ‌ర‌ప‌నుండ‌గా, చెన్నైలో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేస్తార‌ని టాక్. మొత్తంగా మూడు బాషలను కవర్ చేస్తూ ఈ జంట పెళ్లి తంతు కానిస్తున్నరాన్నమాట. 2018లో వ‌చ్చిన గ‌జినీకాంత్ అనే చిత్రంలో ఆర్య‌, సాయేషా క‌లిసి న‌టించారు. అప్పుడు వారి మధ్య పుట్టిన ప్రేమ పెళ్లి దాకా  వచ్చింది.  

More Related Stories