English   

వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటున్న నాగ‌బాబు..

Naga Babu about Lakshmi's NTR
2019-03-10 09:44:37

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పటివరకు వర్మ అంటే త‌న‌కు ఎలాంటి అభిప్రాయం లేద‌ని.. గౌరవం కానీ లేదని.. రాంగోపాల్ వర్మ అంటే ఇష్టం కూడా లేదని ఓపెన్ గానే చెప్పేసాడు ఈ మెగా బ్రదర్. ఇలాంటి సమయంలో ఈయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడటం చర్చనీయాంశమైంది. మార్చి 22న ఈ చిత్రం విడుదల కానుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమా గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. దానికితోడు నందమూరి తారకరామారావు జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటన తీసుకుని రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాంతో అసలు ఆయనకు ఏం జరిగింది.. ఎందుకు ఆయన అంతగా మనోవ్యధ చెంది చనిపోయాడు అనేది చాలా మంది ఇది ప్రజలకు తెలియదు. ఇప్పుడు దీన్ని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం మొదలు పెట్టాడు రామ్ గోపాల్ వర్మ.
ఈ ప్రయత్నంలో చాలా మంది అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు కూడా. ఇప్పుడు నాగబాబు కూడా ఇదే అన్నాడు. దర్శకుడిగా వర్మను తాను చాలా అభిమానిస్తాన‌ని.. ఆయనలోని క్రియేటివిటీని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని చెప్పాడు నాగబాబు. కానీ వ్యక్తిగా మాత్రం ఆయనను అసలు గౌరవించన‌ని.. తనంటే నాకు ఇష్టం కూడా లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందని ఖచ్చితంగా వ‌ర్మ‌ నిజం చూపిస్తాడని నమ్ముతున్నట్లు చెప్పాడు. ఆ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు నాగబాబు. మొత్తానికి శత్రువుల నుంచి కూడా వర్మ అ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటున్నాడు.

More Related Stories