English   

ఈ ఇండిపెండెంట్ గోల ఏంటి హేమ గారూ..?

Actress Hema to contest as independent candidate for MAA Elections
2019-03-10 17:12:27

మా అసోసియేషన్ ఎన్నికలు వేగంగా జరుగుతున్నాయి. ఈ సారి స్టార్ హీరోలు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేదు కానీ సాయంత్రం పోలింగ్ సమయం ముగిసేలోపు కచ్చితంగా చిరంజీవితో పాటు మహేష్ బాబు లాంటి హీరోలు కూడా వచ్చి తమ ఓటు వేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అసోసియేషన్ ఎన్నికల్లో తమ ఓట్లు వేయడం పూర్తిగా మానేసారు స్టార్ హీరోలు. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా వస్తారని.. ఓట్ వేస్తార‌ని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సారి శివాజీరాజా, నరేష్ ప్యానల్ మధ్య చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. వీళ్లిద్దరు ఇలా కొట్టుకుంటుంటే హేమ మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంది. గత ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్ నుంచి గెలిచి ఈసీ మెంబర్ గా బాధ్యతలు తీసుకుంది హేమ. అయితే శివాజీ పాలనలో తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని.. అక్కడ గౌరవం లేదని.. సొంతంగా పోటీ చేస్తుంది హేమ‌. మా అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది ఈమె. దాంతో కాస్త ఆసక్తి మొదలైంది. ఇప్పటికే నరేష్, శివాజీరాజా మధ్య చాలా పెద్ద మాటలు కూడా జరిగింది. దానికి తోడు నరేష్ వర్గానికి చిరంజీవి సపోర్ట్ కూడా ఉండటంతో ఆయన గెలుస్తాడని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

More Related Stories