English   

య‌శ్ ను చంప‌డానికి ఎవ‌రైనా వ‌స్తున్నారా.. కేజియ‌ఫ్ హీరోపై కుట్ర‌..

Yash Subjected to Alleged Murder Plans
2019-03-10 10:56:33

కన్నడ నట కలకలం రేగుతోంది. లోక్ స‌భ‌ ఎన్నికల దృష్ట్యా నేర చరిత్ర ఉన్న రౌడీషీటర్లు, రౌడీలను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు కర్ణాటక పోలీసులు. ఈ సందర్భంగా ఒక బ్యాచ్ సంచలన సమాధానం చెప్పింది. భరత్ అనే వ్య‌క్తి త‌మ‌కు క‌న్న‌డ హీరో య‌శ్ ను చంప‌డానికి సుపారీ ఇచ్చిన‌ట్లుగా కొంద‌రు రౌడీ షీటర్లు క‌ర్ణాట‌క పోలీసుల‌కు స‌మాధానం చెప్పారు. తాను కన్నడ సూపర్ స్టార్, కేజియ‌ఫ్ హీరో యష్ ను చంపడానికి వచ్చామని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఆయన ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా కంగారు పడ్డారు. ఇది ఆ నోటా ఈ నోటా పాకి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. య‌శ్ ను చంపడానికి ఎవరో కుట్ర చేస్తున్నారంటూ వార్తలు ధారాళంగా వ్యాపించాయి. ఇది ఏకంగా య‌శ్ వరకు వెళ్లడంతో ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తనపై ఎలాంటి హత్యాయత్నాలు గాని చంపడానికి కుట్రలు గానీ జరగడం లేదని క్లారిటీ ఇచ్చాడు.
ఇలాంటివి చేయడం వల్ల అనవసరంగా అభిమానులు ఇబ్బంది పడతారని.. దయచేసి లేనిపోని గాలివార్తలు సృష్టించవద్దు అంటూ ఆయన అందరినీ కోరుకున్నాడు. ఈ విషయంలో తాము హోంమంత్రితో కూడా మాట్లాడానని.. అలాంటివేమీ జరగలేదని లేనిపోనివి చెప్పి ప్రేక్షకుల్ని కంగారు పెట్టొద్దు అంటూ యశ్ కోరాడు. రెండేళ్ల కింద ఈయ‌న కార్ పై కొంద‌రు రాళ్లు వేసారు. ఆ కేస్ కూడా అప్పుడే అయిపోయింద‌ని.. వాళ్ల‌ను పోలీసులు అరెస్ట్ చేసి లోప‌ల వేసారంటున్నాడు య‌శ్. ఈ మధ్య కేజియ‌ఫ్ సినిమాతో కన్నడతో పాటు తెలుగు తమిళ హిందీ భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో. దాంతో ఆయనపై లేనిపోని కుట్రలు చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కేజియ‌ఫ్ 2తో బిజీ కానున్నాడు.

More Related Stories