English   

న‌న్ను చంపేస్తారా.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ యూ ట్యూబ్ లో విడుద‌ల‌..

ram gopal varma sensational comments lakshmi's ntr
2019-03-10 11:54:37

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పై వర్మ చాలా సీరియస్ గా ఉన్నాడు. ఇది వరకు ఆయన చేసినట్లు ఏదో అల్లాటప్పాగా కాకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమా తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ఇది ఆయన మాటలను బట్టి అర్థమైపోతుంది. కచ్చితంగా ఈ సినిమాతో సంచలనం సృష్టించాల‌ని కనిపిస్తున్నాడు ఈ దర్శకుడు. ఇక ఈ సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో మరో సంచలన సమాధానం చెప్పాడు రాంగోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ సినిమా ఆగాలి అంటే తనను చంపాలని.. ఒకవేళ తనను చంపినా కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాకుండా ఎవరు ఆపలేరు అంటూ సవాల్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాను ఆల్రెడీ ఒక హార్డ్ డిస్క్ లో కాపీ చేసి పెట్టాన‌ని.. తనను చంపినా కూడా యూట్యూబ్ లో నేరుగా సినిమాను విడుదల చేయండి చీటీ రాసి పెట్టాన‌ని చెబుతున్నాడు వర్మ. ఇది వినేవాళ్లకు సెటైర్ లాగా అనిపించినా కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వర్మ ఎంత సీరియస్ గా తీసుకున్నాడో ఈ మాటలు వింటుంటే అర్థమైపోతుంది. మార్చి 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో కచ్చితంగా అసలు నిజాలు చూపిస్తానంటూ మళ్లీమళ్లీ చెబుతున్నాడు వర్మ. మరి ఈయన చూపించే నిజాలు ఎలా ఉండబోతున్నాయో అనేది చాలామందిలో భయం పుట్టిస్తుంది.

More Related Stories