English   

షూటింగ్‌లో వివేక్ ఒబెరాయ్ కి గాయాలు

Vivek Oberoi Injured During Shooting Of Pm Modi Biopic
2019-03-10 13:45:25

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జీవిత నేప‌థ్యంలో మేరీ కొమ్ ఫేం ఒమంగ్ కుమార్ ‘పీఎం నరేంద్ర మోదీ’ అనే టైటిల్‌తో మూవీ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మోదీ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ న‌టిస్తుండ‌గా, భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్ షా పాత్ర‌లో మరాఠీ నటుడు మ‌నోజ్ జోషి నటిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉత్త‌రాఖండ్‌లోని హ‌ర్షిల్, ధార‌లిలో జ‌రుగుతోంది. జ‌మ్ము కాశ్మీర్‌ లోని లాల్ చౌక్ సెట్ ధారలిలో వేసి ఇక్క‌డ షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు.నాలుగు రోజుల‌పాటు జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్లో మోదీ ఆధ్యాత్మిక‌ జీవితానికి  సంబంధించిన అంశాల‌ని షూట్ చేస్తున్నారని సమాచారం. అయితే కేదార్ మందిరంలో షూటింగ్ జ‌రుపుతున్న‌ సంద‌ర్భంలో పెద్ద రాయి వివేక్ ఒబేరాయ్ కాలికి బలంగా తాకడంతో ఆయన గాయపద్దారట. దీంతో వెంట‌నే హ‌ర్షిల్‌కి చెందిన వైద్య బృందాన్ని పిలిపించింది చిత్ర యూనిట్‌. ఆయ‌న‌కి వైద్యం చేశాక ఆయన కోలుకున్నారని ఆ తర్వాత ఆయనకు కొద్ది సేపు విశ్రాంతినిచ్చి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టినట్టు సమాచారం. వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందుగా ఈ ఏడాది ఎన్నికల ముందు సినిమా రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేశారు, కానీ అది కుదరకపోవడంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది.

 

More Related Stories